ఆఫ్ లైన్ రిటేల్ స్టోర్స్ లో xiaomi ఫోన్ సేల్స్

ఆఫ్ లైన్ రిటేల్ స్టోర్స్ లో xiaomi ఫోన్ సేల్స్

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెని, Xiaomi మరో కొత్త ప్రణాళిక తో ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది. టోటల్ ప్రైసింగ్ సెగ్మెంట్ ను కేవలం 5000 రూ లకు దించేసిన xiaomi ఇప్పుడు brick-and-mortar స్టోర్స్ ద్వారా ఇండియాలో సేల్స్ ను స్టార్ట్ చేయనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇండియాలోనే అతి పెద్ద ఎలెక్ట్రానిక్ కన్సుమర్ డిస్ట్రిబ్యూషన్స్ , Redington తో team అప్ అయ్యి, xiaomi ఫోనులను బయట రిటేల్ స్టోర్స్ లో అమ్మేందుకు నిర్ణయాలు తీసుకుంది. 15 కు పైగా సిటీలలో ముందుగా రెడ్మి 2, MI 4, MI 4i మరియు MI pad లను స్టోర్స్ లో అమ్ముతుంది.

సేమ్ ఆన్ లైన్ లో ఉన్న ధరలే బయట కూడా ఉండనున్నాయి. అయితే కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్స్ మాత్రం మొదటిగా ఆన్ లైన్ స్టోర్స్ లోనే రిరిలీజ్ అవుతాయి. ప్రస్తుతానికి రిటేల్ స్టోర్స్ లో ఎయిర్టెల్ వంటి నెట్వర్క్స్ తో పార్టనర్ షిప్ తో 4G enabled ఫోనులు అమ్ముతుంది xiaomi.

కేవలం ఫ్లిప్ కార్ట్ లోనే కాక స్నాప్ డీల్, అమెజాన్ అండ్ Mi.com లో కూడా xiaomi సేల్స్ అవుతాయి. The Mobile store సైటు లో రెడ్మి నోట్ 4G అండ్ Mi 4 ఫోన్లు సేల్ చేసేందుకు కూడా పార్టనర్ షిప్ కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు మొదటి xiaomi made in india ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు xiaomi గ్లోబల్ VP, Hugo Barra ట్విటర్ లో వెల్లడించారు.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo