xiaomi revealed Xiaomi 17T battery and chipset details
Xiaomi 17T ఇండియా లాంచ్ కోసం టీజింగ్ మొదలుపెట్టిన షియోమీ, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఒక్కొక్క ఫీచర్ ని రివిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ న ను ప్రీమియం ఫీచర్స్ మరియు డిజైన్తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ ముందే తెలిపింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క రివీల్ ఫీచర్స్ చూస్తుంటే, షియోమీ చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది.
షియోమీ 17 టి స్మార్ట్ ఫోన్ జూన్ 4వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అఫీషియల్ సైట్ మరియు అమెజాన్ నుంచి ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ పేజి నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసింది.
షియోమీ ముందుగా ఈ అప్ కమింగ్ స్,స్మార్ట్ ఫోన్ కెమెరా గురించి గొప్ప టీజర్ విడుదల చేసింది. ఇందులో, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన Leica పెరిస్కోప్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ 23mm నుంచి 115mm ఫోకాల్ లెంగ్త్ వరకు గొప్ప ఫోటోలు అందిస్తుందని షియోమీ తెలిపింది. ఈ ఫోన్ కొత్తగా Leica Live Movement అనే కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తున్నట్లు కూడా షియోమీ వెల్లడించింది.
షియోమీ 17 టి స్మార్ట్ ఫోన్ జూమ్ గురించి కూడా షియోమీ గొప్ప చెబుతోంది. ఈ ఫోన్ 5x ఆప్టికల్ జూమ్ తో అల్ట్రా జామ్ అందిస్తుంది. అలాగే, టెలీ మ్యాక్రో, టెలీ పోర్ట్రైట్ మరియు టెలీ స్టేజ్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నట్లు కంపెనీ ఈ ఫోన్ కెమెరా గురించి చెబుతోంది.
ఈరోజు కూడా ఈ ఫోన్ యొక్క కొత్త ఫీచర్స్ రివీల్ చేసింది. ఇందులో ఈ ఫోన్ బ్యాటరీ మరియు చిప్ సెట్ వివరాలు ఉన్నాయి. ఈ ఫోన్ 6500 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు ఈరోజు రివీల్ చేసింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 67W హైపర్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.
Also Read: Jio OTT Pass: జియో యూజర్లకు పండగ లాంటి ప్లాన్ అందించిన జియో.!
ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 8500 తో లాంచ్ అవుతుంది. ఇది 4nm ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ పై రూపొందించబడింది. అందుకే, ఇది తక్కువ బ్యాటరీ ఉపయోగిస్తుంది మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. ఇది నెక్స్ట్ జనరేషన్ APU తో రూపొందించబడింది. కాబట్టి, ఇందులో గొప్ప AI కెమెరా ఫీచర్స్ మరియు మరిన్ని ఏఐ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4 TUV Rheinland సర్టిఫికేషన్ కలిగిన డిస్ప్లే కలిగిన మొదటి ఫోన్ గా ఇండియాలో అవుతోంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా షియోమీ త్వరలో వెల్లడిస్తుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.