Jio OTT Pass: జియో యూజర్లకు పండగ లాంటి ప్లాన్ అందించిన జియో.!

HIGHLIGHTS

జియో తన వినియోగదారుల కోసం మరోసారి ఆకట్టుకునే కొత్త OTT ప్లాన్ ను తెచ్చింది

ప్రస్తుతం OTT ప్లాట్‌ ఫామ్ వినియోగం భారీగా పెరుగుతోంది

ఒకే ప్లాన్‌ లో అనేక స్ట్రీమింగ్ సర్వీస్ లను అందించే కొత్త జియో ఓటీటీ పాస్ ను అందించింది

Jio OTT Pass: జియో యూజర్లకు పండగ లాంటి ప్లాన్ అందించిన జియో.!

Jio OTT Pass: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మరోసారి ఆకట్టుకునే కొత్త OTT ప్లాన్ ను తెచ్చింది. ఇది జియో యూజర్లకు పండగ లాంటి ప్లాన్ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం OTT ప్లాట్‌ ఫామ్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఒకే ప్లాన్‌ లో అనేక స్ట్రీమింగ్ సర్వీస్ లను అందించే విధంగా జియో కొత్త జియో ఓటీటీ పాస్ ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ తో సినిమాలు, వెబ్ సిరీస్‌ లు, లైవ్ స్పోర్ట్స్‌, టీవీ షోలు నెల మొత్తం చూడొచ్చు. తక్కువ ఖర్చుతో ఓటీటీ యాక్సెస్ కోరుకునే వారికి ఇది నిజంగా ఒక గొప్ప వరంలా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio OTT Pass: ఏమిటి ఈ ప్లాన్

టెలికాం మరియు డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్ రంగాలు వేగంగా కలిసిపోతున్న తరుణంలో జియో ఓటీటీ పాస్ వినియోగదారులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా ఉంటుంది . తక్కువ ఖర్చుతో ఎక్కువ OTT కంటెంట్ చూడాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక గా అవుతుంది. ఈ ప్లాన్ తో ను కేవలం రూ. 200 రూపాయల రీఛార్జి తో పొందవచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే యూట్యూబ్ ప్రీమియం మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి 15 ప్రముఖ ఓటీటీ యాప్స్ యాక్సెస్ తో పాటు మరిన్ని లాభాలు అందుకోవచ్చు.

Jio OTT Pass: లాభాలు ఏమిటి?

కొత్త జియో ఓటీటీ పాస్ ద్వారా వినియోగదారులు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జియో హాట్ స్టార్, SonyLIV, Zee5, Sun NXT, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, కంచె లంక, ప్లానెట్ మరాఠి, చౌపల్, Fan Code,తరంగ్ ప్లస్, టైమ్స్ ప్లే మరియు Hoichoi యాక్సెస్ పొందుతారు. ఇది కాకుండా మై జియో ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ మరియు యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా అందుకుంటారు.

Jio OTT Pass

అదనంగా, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జియో స్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్ వర్క్, Warner Bros, ఈటీవీ వంటి 1000కి పైగా ఛానల్స్ కూడా చూడవచ్చు.

Also Read: Weather: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. హీట్ వేవ్స్ మరియు వర్షాలతో ప్రజల ఇక్కట్లు.!

జియో ఓటీటీ పాస్ ను MyJio app ద్వారా సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసిన వెంటనే OTT సబ్ స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా యాక్టివ్ అవుతాయి. ఈ ప్లాన్ తో 30GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. జియో ఓటీటీ పాస్ తో వచ్చే పూర్తి ప్రయోజనాలు 28 రోజులు చెల్లుబాటు అవుతాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile