Redmi Note 9 క్వాడ్ కెమేరా,పెద్ద బ్యాటరీతో చాలా తక్కువ ధరకే లాంచ్ అయ్యింది

Redmi Note 9 క్వాడ్ కెమేరా,పెద్ద బ్యాటరీతో చాలా తక్కువ ధరకే లాంచ్ అయ్యింది
HIGHLIGHTS

షియోమి ఇటీవల తన సరికొత్త స్మార్ట్‌ ఫోన్ Redmi Note 9 ను భారతదేశంలో విడుదల చేసింది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ను సరికొత్త MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఈ Redmi Note 9 ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్ మరియు పెబుల్ గ్రే కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

షియోమి ఇటీవల తన సరికొత్త స్మార్ట్‌ ఫోన్ Redmi Note 9 ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లో పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్ తో పాటుగా వెనుక నాలుగు కెమెరాలు ఉన్నాయి. అదనంగా, ఈ స్మార్ట్‌ ఫోన్‌ ను సరికొత్త MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ ‌ఫోన్, భారత మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వివో ఎస్ 1 ప్రో, ఒప్పో ఎ 92020 మరియు శామ్ ‌సంగ్ గెలాక్సీ ఎ 21 లతో పోటీపడేలా రూపొందించబడింది.

Redmi Note 9 ప్రైస్

షియోమి యొక్క ఈ తాజా రెడ్ మీ నోట్ 9 స్మార్ట్‌ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధర వరుసగా రూ .11,999, రూ .13,499, రూ .14,999 . ఈ స్మార్ ఫోన్ అమ్మకాలు జూలై 24, 2020 న కంపెనీ అధికారిక సైట్ మరియు అమెజాన్ ఇండియాలో ప్రారంభమవుతాయి. ఈ Redmi Note 9 ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్ మరియు పెబుల్ గ్రే కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

రెడ్ మీ నోట్ 9 స్పెసిఫికేషన్

షియోమి రెడ్ మీ నోట్ 9 ఒక 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. అలాగే, ఈ స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 మరియు మెరుగైన పనితీరు కోసం మీడియాటెక్ Helio G 85 ప్రాసెసర్‌ సపోర్ట్ తో వస్తుంది. అదే సమయంలో, ఈ స్మార్ట్ ‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్ ‌లో పనిచేస్తుంది.

Redmi Note 9 కెమేరా

కెమెరా గురించి మాట్లాడితే, వినియోగదారులకు రెడ్ మీ నోట్ 9 స్మార్ట్‌ ఫోన్ ‌లో క్వాడ్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఇందులో, 48 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ISOCELL సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ వంటి కెమేరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

Redmi Note 9 బ్యాటరీ

కనెక్టివిటీ కోసం రెడ్ మీ నోట్ 9 లో 4 జి వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ వెర్షన్ 5.0, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్ ‌ఫోన్ జాక్ మరియు యుఎస్‌బి పోర్ట్ టైప్-సి ఉన్నాయి. అదనంగా, వినియోగదారులు ఈ రెడ్ మీ నోట్ 9 లో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుతారు, ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo