OnePlus Nord Buds 4 Pro: ప్రో లెవల్ ANC మరియు మంచి స్పీకర్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్ ను ఎట్టకేలకు ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది

ఈ లేటెస్ట్ ఇయర్ బర్డ్స్ ను ప్రో లెవల్ ANC మరియు మంచి స్పీకర్ సపోర్ట్ తో లాంచ్ చేసింది

Hi-Res Audio మరియు LHDC సపోర్ట్ తో మరింత గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తాయని కూడా వన్ ప్లస్ తెలిపింది

OnePlus Nord Buds 4 Pro: ప్రో లెవల్ ANC మరియు మంచి స్పీకర్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!

OnePlus Nord Buds 4 Pro: వన్ ప్లస్ గత కొంతకాలంగా టీజింగ్ చేస్తూ వస్తున్న వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్ ను ఎట్టకేలకు ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఇయర్ బర్డ్స్ ను ప్రో లెవల్ ANC మరియు మంచి స్పీకర్ సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఈరోజే సరికొత్తగా విడుదలైన ఇయర్ బర్డ్స్ యొక్క ప్రైస్ ఆఫర్స్ మరియు ఫీచర్స్ కంప్లీట్ గా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord Buds 4 Pro: ధర

వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 3,999 ధరతో ఇండియాలో విడుదల చేసింది. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ బడ్స్ సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త ఇయర్ బడ్స్ పై రెండు వందల రూపాయల తగ్గింపు ఆఫర్ ని కూడా వన్ ప్లస్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ బడ్స్ ను రూ. 3,799 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

OnePlus Nord Buds 4 Pro: ఫీచర్స్

వన్ ప్లస్ లేటెస్ట్ గా అందించిన నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్ టైటానియం కోటెడ్ 12mm డ్రైవర్ (స్పీకర్) కలిగి ఉంటాయి. ఇది మరింత ఉన్నతమైన బాస్ అండ్ క్లియర్ మిడ్స్ అందించే స్పీకర్. ఈ సెటప్ తో ఈ బడ్స్ చాలా ఉన్నతమైన సౌండ్ ఆఫర్ చేస్తుందని వన్ ప్లస్ పేర్కొంది. ఈ వన్ ప్లస్ బడ్స్ Hi-Res Audio మరియు LHDC సపోర్ట్ తో మరింత గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తాయని కూడా తెలిపింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ 3D స్పేషియల్ ఆడియో, Ai ట్రాన్స్లేట్, AI అసిస్టెంట్ మరియు గేమ్ సౌండ్ స్పేషియల్ ఆడియో వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

OnePlus Nord Buds 4 Pro Price and Features

ఈ ఇయర్ ను 52dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) సపోర్ట్ అందించింది. ఇది బయట నుంచి వచ్చే రణగొణ ధ్వనులు చెవిలో చేరకుండా నిలువరించి, లీనమయ్యే మ్యూజిక్ మరియు కాలింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ కొత్త బడ్స్ టచ్ కంట్రోల్ మరియు వాల్యూమ్ స్వైప్ వంటి చాలా స్మార్ట్ కంట్రోల్ తో ఆకట్టుకుంటుంది.

Also Read: Realme P4 Lite 5G: చవక ధరలో 7000 mAh బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ గా లాంచ్ అయ్యింది.!

ఇక కాలింగ్ విషయానికి వస్తే, ఈ బడ్స్ లో కాలింగ్ కోసం 6 మైక్ సెటప్ ను వన్ ప్లస్ జత చేసింది. ఇది కాకుండా AI Clear కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో గొప్ప కాలింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే, ఈ బడ్స్ లో 62 mAh బ్యాటరీ మరియు ఛార్జింగ్ కేస్ లో 530 mAh బ్యాటరీ ఉంటాయి. ఈ సెటప్ తో ఈ బడ్స్ 54 గంటల లాంగ్ ప్లే బ్యాక్ కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 6.0 తో వస్తుంది. ఇది గొప్ప కనెక్టివిటీ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile