OPPO K14 5G Sale: ఫస్ట్ డే బెస్ట్ డీల్స్ తో సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

HIGHLIGHTS

లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె 14 5జి ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది

OPPO K14 5G పై మంచి డిస్కౌంట్ అందుకునే విధంగా మంచి లాంచ్ ఆఫర్స్ కూడా జత చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ డే సేల్ కంటే ముందే ఈ ఫోన్ డీల్స్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ తెలుసుకోండి

OPPO K14 5G Sale: ఫస్ట్ డే బెస్ట్ డీల్స్ తో సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

OPPO K14 5G Sale: ఒప్పో రెండు రోజుల క్రితం విడుదల చేసిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె 14 5జి ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది. ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ ఫీచర్స్ తో అండర్ 20K ఫోన్ గా అందించింది. మొదటి రోజు ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి డిస్కౌంట్ అందుకునే విధంగా మంచి లాంచ్ ఆఫర్స్ కూడా జత చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ డే సేల్ కంటే ముందే ఈ ఫోన్ డీల్స్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO K14 5G Sale: ప్రైస్

ఒప్పో కె 14 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB + 128GB) ను కేవలం రూ. 17,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్ వేరియంట్ (6GB + 256GB) ను రూ. 19,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 21,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐసి బ్లూ, ప్రిజం వయోలెట్ మరియు ప్రిజం వైట్ ముందు కలర్ ఆప్షన్స్ లో అందించింది.

OPPO K14 5G Sale offers and deals

ఆఫర్స్ అండ్ సేల్

ఈ ఫోన్ పై ఒప్పో మంచి లాంచ్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 1000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను HDFC, SBI మరియు ICICI కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై 3 నెలల No Cost EMI ఆఫర్ కూడా అందించింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది.

Also Read: కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ లోనే Dolby Soundbar అందుకోండి.!

OPPO K14 5G: ఫీచర్స్

ఒప్పో కె 14 5జి ఫోన్ 6.75 ఇంచ్ డిస్ప్లే ని HD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1125 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఒప్పో కొత్త ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G ప్రోసెసర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ లో గరిష్టంగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ కూడా అందించింది. ఈ ఫోన్ Android 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ లేటెస్ట్ అప్డేట్ కూడా వెంటనే అందుకుంటుంది.

ఈ ఒప్పో ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో AI కెమెరా ఫీచర్స్ మరియు ఒప్పో కెమెరా ఫిల్టర్లు ఉన్నాయి. బ్యాటరీ మరియు IP రేటింగ్ విభాగాల్లో ఈ ఫోన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇందులో 7000 mAh భారీ బ్యాటరీని ఒప్పో ఈ ఫోన్ లో అందించింది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. అలాగే, ఈ ఫోన్ ను IP 69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ రెసిస్టెంట్ ఫీచర్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile