షావోమి రెడ్మి నోట్ 9 ప్రో & 9 ప్రో మ్యాక్స్ లాంచ్ అయ్యాయి: మీరు తెలుసుకోవాల్సిన టాప్ ఫ్యాక్స్ట్ .

HIGHLIGHTS

రెడ్మి నోట్ 9 ప్రో మరియు రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ని కూడా మిడ్ రేంజ్ ధరలో ప్రకటించింది.

షావోమి రెడ్మి నోట్ 9 ప్రో & 9 ప్రో మ్యాక్స్ లాంచ్ అయ్యాయి: మీరు తెలుసుకోవాల్సిన టాప్ ఫ్యాక్స్ట్ .

ఇండియాలో ప్రధమ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా కొనసాగుతున్న షావోమి, తన మరొక సిరీస్ అయినటువంటి Redmi 9 Series ను ఈ రోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ 9 సిరిస్ నుండి రెడ్మి నోట్ 9 ప్రో  మరియు రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్  స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వీటిలో కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్లను కూడా జత చేసినట్టు విడుదల కార్యక్రమంలో కంపెనీ పేర్కొంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ  రెడ్మి నోట్ 9 ప్రో మరియు రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ని కూడా మిడ్ రేంజ్ ధరలో ప్రకటించింది. రెడ్మి నోట్ 9 ప్రో ని రూ.12,999 రూపాయల ప్రారంభధరతో మరియు రెడ్మి నోట్ 9 మ్యాక్స్ స్టార్టింగ్ వేరియంట్ ని రూ.14,999 ధరతో విడుదల చేసింది.

ప్రత్యేకతలు

ఈ రెండు స్మార్ట్ ఫోన్లను కూడా ఒకే రకమైన ప్రాసెసర్లతో తీసుకొచ్చింది. అయితే, కెమేరాలు మరియు ఛార్జింగ్ టెక్నాలజీ వంటి వాటిలో కొన్ని మార్పులు చేసింది. అయితే, ధరలను బట్టి చూస్తే మాత్రం ఇవి ఏమంత ఎక్కువగా అనిపించవు. ఈ రెండు ఫోన్లు కూడా, ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటాయి. ఇది 2400×1080 అంటే FHD+ రిజల్యూషన్ మరియు గరిష్టంగా 450 నిట్స్ బ్రైట్నెస్ అందిచే సామర్ధ్యంతో వస్తాయి. అంతేకాదు, ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో అందించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా కొత్త ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తాయి. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది.     

రెడ్మి నోట్ 9 ప్రో 4GB +64GB మరియు 6GB + 128GB వేరియంట్లలో వస్తుండగా, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ మాత్రం 6GB +64GB, 6GB + 128GB మరియు  8GB + 128GB వంటి మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ధరలు :                         

రెడ్మి నోట్ 9 ప్రో

1. రెడ్మి నోట్ 9 ప్రో ( 4GB +64GB ) -Rs.12,999

2. రెడ్మి నోట్ 9 ప్రో ( 6GB +128GB ) -Rs.15,999

రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్                          

1. రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ( 6GB +64GB ) -Rs.14,999

2. రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ( 6GB +128GB ) -Rs.16,999

2. రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ( 8GB +128GB ) -Rs.18,999

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్ల యొక్క కెమెరాలలో మార్పులు వున్నాయి. రెడ్మి నోట్ 9 ప్రో వెనుక 48MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ మాత్రం 64MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. అంటే, ప్రధాన కెమెరాలలో పెద్ద మార్పు మీకు కనిపిస్తుంది. ఇక ముందుభాగంలో, రెడ్మి నోట్ 9 ప్రో ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమేరాని ఇవ్వగా, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ లో మాత్రం 32MP సెల్ఫీ కెమేరాని ఇచ్చింది.

ఇక బ్యాటరీ మరియు ఛార్జింగ్ విషయానికి వస్తే,  ఈ రెడ్మి నోట్ 9 ప్రో మరియు రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ రెండు ఫోన్లలో కూడా ఒక 5020mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. అయితే, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ఒక 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో  మాత్రం కేవలం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. మంచి విషయం ఏమిటంటే ఈ రెండు ఫోన్లు కూడా వాటికీ సరిపోయిన సపోర్ట్ ఛార్జర్ ని బాక్సుతో పాటుగా తీసుకువస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo