Xiaomi Redmi Note 6 Pro : స్నాప్ డ్రాగన్ 660 SoC, 5000 mAh బ్యాటరీతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్, అనుకోకుండా ఫ్లిప్ కార్ట్ ద్వారా లిస్ట్ చేయబడింది

Xiaomi Redmi Note 6 Pro : స్నాప్ డ్రాగన్ 660 SoC, 5000 mAh బ్యాటరీతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్, అనుకోకుండా ఫ్లిప్ కార్ట్ ద్వారా లిస్ట్ చేయబడింది
HIGHLIGHTS

ఈ సంవత్సరం ఆగష్టులో, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో వేరియంట్ ఒక Snapdragon 660 SoC ద్వారా ఆధారితమైన వేరియంట్, చైనీస్ సోషల్ మీడియా వేదికైన Weibo లో కనిపించింది.

ముఖ్యాంశాలు:

1. ఫ్లిప్ కార్ట్ అనుకోకుండా Xiaomi Redmi Note 6 Pro  యొక్క ఒక కొత్త వేరియంట్ జాబితా చేసింది

2. ఈ కొత్త వేరియంట్ ఒక స్నాప్ డ్రాగన్ 660 SoC యొక్క శక్తిని కలిగివుంది మరియు 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది

అప్డేట్ : Flipkart లో జరిగిన ఈ తప్పును గురించి ఇలా వివరించింది.  ఈ ఫోన్ యొక్క స్పెక్స్ ను డిజైన్ టీమ్ అనుకోకుండా కలగలిపినట్లు తెలియచేసింది.   అలాంటి ఏవిధమైన డివైజ్ వారి సంస్థ యొక్క పైప్ లైన్లో  లేదని ఫ్లిప్ కార్ట్ డిజిట్ కి తెలియచేసింది. అయితే, మేము అధికారిక ప్రతిస్పందన కోసం ఒక Flipkart ప్రతినిధిద్వారా తెలుసుకున్నాము.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఆగష్టులో, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో  వేరియంట్  ఒక Snapdragon 660 SoC ద్వారా ఆధారితమైన వేరియంట్, చైనీస్ సోషల్ మీడియా వేదికైన Weibo లో కనిపించింది. ఇండియాలో, ఈ ప్రత్యేకమైన పరికరాన్ని చేస్తారని ఈ పోస్ట్ పేర్కొంది. అయితే, ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసరుతో  ప్రారంభించబడింది. ఇప్పుడు, ఈ వేరియంట్ మళ్ళీ కనిపించింది, ఫ్లిప్ కార్ట్  ప్లాట్ఫారములో  అనుకోకుండా అది సేల్ కోసం జాబితా చేయబడింది.

అయితే, వెంటనే ఆ జాబితా నుండి  ఈ చిత్రం తీసివేయబడింది మరియు ఒక స్నాప్డ్రాగన్ 636 చిప్సెట్ తో  ఈ వేరియంట్ అమ్మకం కింద జాబితా చేయబడింది. కానీ,  ఈ e-కామర్స్ ప్లాట్ఫారము నుండి ఈ చిత్రాన్ని తొలగించదానికంటే  ముందుగానే, టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ ఒక స్క్రీన్ షాట్ తీసి, ట్విటర్లో పోస్ట్ చేశాడు. స్నాప్ డ్రాగన్ 660 SoC తోపాటుగా ఈ వేరియంట్ 4,000mAh బ్యాటరీకి బదులుగా 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న వేరియంట్.

redmi note 6 pro.jpeg

రెడ్మి నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్మి నోట్ 6 ప్రో  ఒక 6.26-అంగుళాల పూర్తి-HD + IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 19: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియో మరియు 1080×2280 పిక్సెల్ రిజల్యూషన్లను అందిస్తుంది. కెమెరాలు, ప్రాక్సిమిటీ / పరిసర కాంతి సెన్సర్, స్పీకర్ మరియు నోటిఫికేషన్ లైట్ వంటివి కలిగిన ఒక నోచ్ ఇందులో ఉంటుంది. పైన పేర్కొన్న విధంగా, ఈ ఫోన్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 SoC మరియు 4GB / 6GB RAM మరియు 64GB అంతర్గత స్టోరేజితో ఉంటుంది.

ఆప్టిక్స్ పరంగా, రెడ్మి నోట్ 6 ప్రో  వెనుకభాగంలో డ్యూయల్ 12MP + 5MP సెన్సార్లను కలిగివుంది. 12MP సెన్సార్ ఒక 1.4 యొక్క ఒక పిక్సెల్ పిచ్ ని  కలిగి ఉంది మరియు ఇది f / 1.9 ఎపర్చరుతో లెన్స్ జత చేయబడింది. అలాగే,  ఈ ప్రధాన కెమెరా డ్యూయల్ ఆటో ఫోకసుకు మద్దతునిస్తుంది. రెండవ కెమేరాగా   5MP డెప్త్ లను  పసిగట్టగల సెన్సార్ ఉంది. ముందు, నోచ్ లో 4-in-1 పిక్సెల్ బిన్నింగ్కు మద్దతు ఇచ్చే ఒక 20MP ప్రధాన సెన్సార్ను కలిగి ఉంది మరియు 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉంది.

Xiaomi Redmi Note 5 మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ తో 660 ప్రాసెసరుతో కూడిన Xiaomi Redmi Note 5 Pro ఫోన్ Geekbench లో కనిపించిన,  రెండు రోజుల తరువాత, ఈ వార్తలు వచ్చాయి. ఈ రెండు ఫోన్లు Android Pie 9.0 పైన నడుస్తున్నట్లు ఇందులో కనిపించాయి. రెడ్మినోట్ 5ఫోన్, స్నాప్ డ్రాగన్ 625 తో ప్రారంభించబడింది మరియు ప్రో వేరియంట్ స్నాప్ డ్రాగన్  636 ప్రాసెసరుతో నడుస్తుంది. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ తో విడుదలచేయబడ్డాయి  మరియు తర్వాత Android Oreo కు అప్గ్రేడ్ చేయబడ్డాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo