షావోమి రెడ్మి నోట్ 5 ప్రో ఫోన్ పైన భారీ డిస్కౌంట్ : ఇప్పుడు కేవలం రూ. 10,999

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుండి బెస్ట్ డీల్ ఇదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.

షావోమి నుండి మంచి స్పెక్స్ మరియు ఫిచర్ల పరంగా అందరిని ఆకట్టుకున్న స్మార్ట్ ఫోనుగా, ఈ షావోమి రెడ్మి నోట్ 5 ప్రో ని చెప్పవచ్చు. ఇప్పటివరకూ,  ఒక కోటికి పైగా అమ్మకాలను సాధించినట్లు కంపెనీ చెబుతున్న, ఈ స్మార్ట్ ఫోన్ మరొకసారి భారీగా అమ్మకాలను సాగించనుంది. ఎందుకంటారా? ఈ స్మార్ట్ పైన ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించింది తన రిపబ్లిక్ డే సేల్ ద్వారా ఫ్లిప్ కార్ట్. ముందుగా, రూ. 14,999 ధరతో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 10,999 ధరతో ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ సేల్ నుండి జాబితా చేయబడింది.

షావోమి రెడ్మి నోట్ 5 ప్రో  ధర – కేవలం రూ. 10,999  (LINK)

అంతేకాకుండా, SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి, 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుతుంది, అంటే దాదాపుగా 1000 తగ్గింపన్నమాట. అలాగే, No Cost EMI కూడా అందుబాటులోవుంది. కొనుగోలు చేయటానికి పైన  ఇచ్చిన (LINK) పైన నొక్కండి.

షావోమి రెడ్మి నోట్ 5 ప్రో ప్రత్యేకతలు

షావోమి రెడ్మి నోట్ 5 ప్రో ఒక 5.99-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది కూడా 1080 x 2160 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసర్, 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతచేయడింది. షావోమి  రెడ్మి నోట్ 5 ప్రో ముందు 20MP యూనిట్ తో డ్యూయల్ 12MP + 5MP వెనుక కెమెరా కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :