REDMI 7A : షావోమి నుండి మరొక బడ్జెట్ ఫోన్
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బాడీ పాలికార్బోనేట్ తో ఇవ్వబడింది మరియు ఇది P2i నానో-కోటింగ్ తో అందించడం వలన స్ప్లాష్ ప్రూఫ్ గా పనిచేస్తుంది.
మొబైల్ రంగంలో అతితక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందిస్తూ దూసుకుపోతున్న, షావోమి సంస్థ ఇప్పుడు మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ సంవత్సరం మొదటి నుండే తన హావ కొనసాగిచడం మొదలు పెట్టిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో, తన 7 సిరిస్ పైన ఎక్కువ స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది. ముందుగా, రెడ్మి నోట్ 7, రెడ్మి నోట్ 7 ప్రో, రెడ్మి 7, రెడ్మి నోట్ 7S వంటి స్మార్ట్ ఫోన్లను తీసుకురాగా, ఇప్పుడు రెడ్మి 7A ని కూడా ఈ సిరీస్ లో భాగంగా తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్, రెడ్మి 6A యొక్క తరువాతి తరం ఫోనుగా ఉండనుండి. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది మాత్రం చైనాలో. కాని, షావోమి యొక్క అంచనా ప్రకారంగా చూస్తే, ఈ ఫోన్నుఅతి త్వరలోనే ఇండియాలో విడుదలచేసే అవకాశాలు మెండుగా కనిపిస్తుంది.
Surveyషావోమి రెడ్మి 7A ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బాడీ పాలికార్బోనేట్ తో ఇవ్వబడింది మరియు ఇది P2i నానో-కోటింగ్ తో అందించడం వలన స్ప్లాష్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. Xiaomi రెడ్మి 7A ఆండ్రాయిడ్ 9 పై మీద ఆధారంగా MIUI 10 తో ప్రారంభించబడింది. ఈ ఫోనులో ఒక 5.45 అంగుళాల IPS LCD డిస్ప్లే అందించారు మరియు ఇది ఒక 18: 9 ఆస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు ఇది HD + రిజల్యూషన్ అందిచే డిస్ప్లే.
ఈ Radmi 7A ఒక స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా – కోర్ చిప్సెట్ తో ప్రారంభించబడింది. ఇది 1.95 గిగాహెడ్జ్ వద్ద క్లాక్ చెయ్యబడింది. ఈ ఫోన్ ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ కలిగివున్నట్లు తెలియచేసినప్పటికీ, దీని యొక్క RAM మరియు స్టోరేజి ఎంపికల వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఈ ఫోనులో అత్యదికంగా 10W ఛార్జింగ్ కి మద్దతును అందించే ఒక 4,000 mAh బ్యాటరీని అందించడం గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఇక కెమెరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక LED ఫ్లాష్ తో కూడిన సింగిల్ 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా కలిగి ఉంది. అలాగే, సెల్ఫీల కోసం, ఈ ఫోన్లో 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాని కలిగివుంటుంది. సెక్యూరిటీ విభగానికి వస్తే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ హ్యాండ్ సెట్ యొక్క వెనుక భాగంలో అందించబడింది మరియు AI ఆధారిత పేస్ అన్లాక్కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్, 4 జీ వోల్టి, వై-ఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్ వాటి వాటిని కలిగివుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
