షావోమి POCO F1 Lite వెర్షన్ గీక్ బెంచ్ పైన దర్శనమిచ్చింది

షావోమి POCO F1 Lite వెర్షన్ గీక్ బెంచ్ పైన దర్శనమిచ్చింది
HIGHLIGHTS

మరొక POCO ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు Xiaomi Pocophone F1 యొక్క అభిమానుల కోసం, శుభవార్త ! Geekbench బ్రౌజర్లో Xiaomi POCO F1 యొక్క Lite వెర్షన్ దర్శనమిచ్చింది. అంతేకాక, ఈ స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ జతగా 4GB RAM తో ఉండనుంది. Geekbench వెబ్సైట్లో ఇచ్చిన లిస్టింగ్ కూడా ఈ  స్మార్ట్ ఫోన్ బాక్స్ నుండి బయటకి వస్తూనే, ఒక ఆండ్రాయిడ్ 9 ఫై తో నడుస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ విషయాన్ని నాష్విల్లే చాటర్ గుర్తించారు, ఈ POCO F1 లైట్ లిస్టింగ్, Xiaomi Uranus అనే మరొక మర్మమైన ఫోన్ జాబితాను కూడా కలిగి ఉంటుంది. ఇవి రెండుకూడా ఒకే విధమైన స్పెక్స్ కలిగి ఉన్నప్పటికీ, ఈ రెండు షావోమి మోడళ్ళు ఫోనుకు చెందినా లేదా రెండు వేర్వేరు మోడళ్ళకి సంబంచినవా అని మనము ఇంకా ఖచ్చితంగా చెప్పలేము.

ఊహించిన విధంగా,  సింగిల్ -కోర్ టెస్ట్ లో 4830 స్కోర్ మరియు మల్టి-కొర్ టెస్ట్ లో 1341 స్కోర్ మినహా, Geekbench బ్రౌజర్ లిస్టింగ్ POCO F1 లైట్ గురించి పూర్తిగా వెల్లడించలేదు. పోలికగా, ఈ కొత్త షావోమి యురేనస్, ఈ రెండు టెస్టులలో కొద్దిగా తక్కువగా 1329 మరియు 4821 స్కోరు సాధించింది. POCO F1 లైట్ వలెనే, యురేనస్ కూడా ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ మరియు 4GB RAM ని కలిగి ఉంది. ఇది కూడా బాక్స్ నుండి బయటకి వస్తూనే, ఆండ్రాయిడ్ 9 పై తో నడుస్తుంది.

Geekbench Poco F1 Lite.jpg

షావోమి గత సంవత్సరంలో POCO ఉప బ్రాండ్ను ప్రారంభించింది, ఇది పనితీరు ప్రాముఖ్యత ఉన్న OnePlus- వంటి నమూనాలను మార్కెట్లోకి  తీసుకువచ్చే  ప్రయత్నంలో ఉంది. షావోమి పోకో F1 గత సంవత్సరం మూడవ త్రైమాసికంలో రూ .20,999 ప్రారంభ  ధరతో అమ్మకానికి వచ్చింది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 చిప్సెట్ కలిగిన ఏకైక చౌక ఫోనుగా పేరుగాంచింది, వాస్తవానికి ఈ చిప్సెట్  ప్రధాన బ్రాండ్ల ప్రధాన మోడళ్లలో మాత్రమే కనిపించేది. ఒకవేళ ఈ POCO F1 లైట్  భారతీయ మార్కెట్ కోసం అందిస్తే, అది రూ. 15,000 కంటే తక్కువ ధర కోసం విక్రయించవచ్చని మేము అంచనావేస్తున్నాము. ఇది ఒక స్నాప్డ్రాగెన్ 660 చిప్సెట్ ద్వారా ఆధారితమైన, రెడ్మి నోట్ 7 కి  గట్టి పోటీగా ఉండవచ్చని అనిపిస్తోంది.

 ఒక IPS LCD ప్యానెల్ కలిగి ఒక 6.18 అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేతో ఈ షావోమి పోకో F1 ఉండగా, POCO F1 లైట్ ఒక చిన్న స్క్రీన్ తో ఉండవచ్చు. అయితే, సాధారణ నోచ్ కలిగి ఉంటుంది. ఈ Pocophone F1 యొక్క అతి పెద్ద లోపాలలో ముఖ్యమైంది WideVine  L1 సర్టిఫికేట్ లేకపోవడం, దీనితో వినియోగదారులు నెట్ఫ్లిక్స్ మరియు ఇటువంటి ఇతర ప్లాట్ఫారమ్ల పైన HD కంటెంట్ను చూడడానికి అనుమతిపొందాలేకపోయారు. ఈ సర్టిఫికేట్ తర్వాత మోడల్  కొన్ని పరిమితులతో విడుదలైంది. అయితే, ఈ  POCO F1 లైట్ లో ఈ దోషం సరిచేయచేసి ఉండాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo