షియోమీ Mi A2 ఇప్పుడు ఆగష్టు 8 న అమెజాన్ ఎక్స్క్లూజివ్ స్మార్ట్ ఫోన్ గా భారతదేశం లో విడుదల కానుంది

షియోమీ Mi A2 ఇప్పుడు ఆగష్టు 8 న అమెజాన్ ఎక్స్క్లూజివ్ స్మార్ట్ ఫోన్ గా భారతదేశం లో విడుదల కానుంది
HIGHLIGHTS

షియోమీ కోసం అమెజాన్ .ఇన్ ఒక ప్రత్యేక పేజీ ని నిర్మించింది. దీనిలో Mi A2 స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ మరియు మీడియా రివ్యూ లు ఇందులో జాబితాగా ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ తో తీసిన ఆరు చిత్రాలను కూడా ఇందులో పొందుపరిచారు .

చాలాకాలంగా  అందరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న Mi A2 స్మార్ట్ ఫోన్ ని షియోమీ గత వారం మాడ్రిడ్ లో జరిగిన గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమంలో విడుదల చేసింది. భారతదేశం తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో ఇది అందుబాటులో ఉండనున్నదని ఈ కార్యక్రమంలో షియోమీ ప్రకటించింది. చాలాకాలం నిరీక్షణ తరువాత ఈ చైనా ఉమ్మడి సంస్థ ఈ ఫోన్ ని మన దేశం లో అమెజాన్ ఎక్స్క్లూజివ్ స్మార్ట్ ఫోన్ గా అందించాలని నిర్ణయించుకుంది. అమెజాన్ .ఇన్ హోమ్ పేజీ లో రోలింగ్ యాడ్ ని ప్రజలు ఇప్పుడు చూడవచ్చు.

యాడ్ మీద నొక్కినట్లయితే ,"నోటిఫై మీ" బటన్ తో కూడిన ఒక కొత్త పేజీ వస్తుంది. ఈ బటన్ ని నొక్కడం ద్వారా నోటిఫికేషన్ ని పొందే వీలుంటుంది.ఈ ఫోన్ అందు బాటులోకి వచ్చిన వెంటనే ఈ వెబ్ సైట్ మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ ప్రత్యేక పేజీలో పైన తెలిపిన వివరాలతో పాటుగా ఈ స్మార్ట్ ఫోన్ కు సంబందించిన ఫీచర్ల గురించి సమాచారాన్ని కూడా ఉంచారు. పేజీ ని కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఈ డివైజ్ యొక్క మీడియా రివ్యూ లు కూడా మీరు చూడవచ్చు. దీని కెమేరాని ప్రమోట్ చేయడం కోసం కంపెనీ ఈ కెమేరాతో చిత్రించిన ఆరు ఫోటోలను "#షాట్ఆన్MiA2" అనే బ్యానర్ శీర్షిక కింద అప్లోడ్ చేసింది. 

షియోమీ Mi A2 స్పెసిఫికేషన్స్ : ఈ షియోమీ Mi A2 అల్యూమినియం యూనీబాడీ తో ఉంటుంది ఇంకా ఇది టైప్ సి-ఛార్జింగ్ పోర్ట్ తో ఛార్జింగ్ తో పాటుగా USB  గాకూడా వాడుకునే వీలుంది .అలాగే 18:9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 5. 99-ఇంచ్ ఫుల్ హెచ్ డి+ఐపిఎస్ ప్యానల్  కలిగివుంది.ఇంకా ఈ  ప్యానల్ 2.5డి కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ తో ప్రొటెక్ట్ చేయబడింది . ఒక ఆక్టా-కోర్ క్వాల్కమ్  స్నాప్ డ్రాగన్  660 చిప్సెట్ ఈ స్మార్ట్ ఫోన్ కి  2.2 సామర్ధ్య శక్తిని  అందిస్తుంది. షియోమీ మూడు వేరియంట్లలో Mi A2 విడుదల చేసింది.  అవి-4జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజి, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజి మరియు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజి. ఈ మూడు వేరియెంట్లలో దేనిని ఇండియా లో అందించనున్నారు అన్న విషయం మరియు ఈ ఫోన్ ఒక్క ధర యెంత వుండవచ్చు అన్న విషయాన్ని కూడా అమెజాన్ లో బయటపెట్టలేదు.

ఇంకా దీని వెనుక భాగంలో మధ్యలో అమర్చిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో బాటుగా పై భాగంలో ఎడమ మూలలో నిలువుగా అమర్చిన డ్యూయల్-కెమేరా ఉంది. ఆప్టిక్స్ పరంగా, Mi A2 వెనుకవైపు డ్యూయల్-కెమేరా వ్యవస్థతో వస్తుంది. పోర్ట్రేయిట్ ఫోటోగ్రఫీ కోసం దీనిలో ప్రధాన కెమేరాగా 12ఎంపీ సోనీ IMX486 సెన్సార్ మరియు ద్వితీయ కెమేరాగా 20ఎంపీ సోనీ IMX376 సెన్సార్ ని కలిగివుంది. ఈ రెండు లెన్సులు కూడా f/1.75 ఏపేర్చేర్ ను కలిగివున్నాయి . సోనీ IMX376 సెన్సార్ మరియు షియోమీ సూపర్ పిక్సెల్ టెక్నాలజీ తో కూడిన ఒక 20ఎంపీ కెమేరాని ముందు భాగంలో అందించారు. ఈ ఫోన్ మూడు రంగులలో లభించనుంది అవి – గోల్డ్ ,నీలం మరియు నలుపు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo