షావోమి Mi A2 బెస్ట్ మిడ్ రేంజ్ కెమేరాగా డిజిట్ జీరో వన్ అవార్డును గెలుచుకుంది

షావోమి Mi A2 బెస్ట్ మిడ్ రేంజ్ కెమేరాగా డిజిట్ జీరో వన్ అవార్డును గెలుచుకుంది
HIGHLIGHTS

బెస్ట్ మిడ్ రేంజ్ కెమేరా విభాగంలో షావోమి యొక్క Mi A2 స్మార్ట్ ఫోన్ ఎంపికయ్యింది.

ఇప్పుడు అమేజాన్ ఇండియాలో కూడా డిజిట్ యొక్క అవార్డు విన్నర్ ఫోన్లను ఒక జాబితాగా అందిస్తోంది.

ఈ Mi A2 స్మార్ట్ ఫోన్ యొక్క 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి వేరియంట్ కేవలం రూ.11,999 ధరతో అందుబాటులో వుంది.

బెస్ట్ కెమేరాలు మరియు గొప్ప AI సెన్సింగ్ తో ఈ అవార్డును సొంతం చేసుకుంది మరియు అమేజాన్ ఇండియాలో లిస్ట్ చెయ్యబడింది.

2018 సంవత్సరం మొత్తానికి గాను డిజిట్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ మిడ్ రేంజ్ కెమేరా విభాగంలో షావోమి యొక్క Mi A2 స్మార్ట్ ఫోన్ ఎంపికయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ సోనీ యొక్క సెన్సారుతో మరియు AI సెన్సింగ్ తో మంచి కెమెరా సిస్టం తీసుకువస్తుంది మరియు ఇందులో అందించిన స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ కూడా ఈ కెమెరాకు మంచి తోడ్పాటుగా ఉండటంతో ఈ ఫోన్ మంచి కెమెరా ఫోనుగా నిలచింది, మిడ్ రేంజ్ పరిధిలో నిలచింది. ఇప్పుడు అమేజాన్ ఇండియాలో కూడా డిజిట్ యొక్క అవార్డు విన్నర్ ఫోన్లను ఒక జాబితాగా అందిస్తోంది.

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ ధరలతో లభిస్తుంది, ఈ Mi A2 స్మార్ట్ ఫోన్ యొక్క 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి వేరియంట్ కేవలం రూ.11,999 ధరతో అందుబాటులో వుంది. ఇక్కడ అందించిన  Amazon.in  పైన నొక్కడం ద్వారా డిజిట్ అవార్డులను గెలుచుకున్నస్మార్ట్ ఫోన్లను కూడా చూడవచ్చు మరియు కొనుగోలు చేయవచు.                

షావోమి Mi A2  స్పెసిఫికేషన్స్

డిజైన్ పరంగా, మీ ఎ2 రెడ్ మీ నోట్ 5 ప్రో ను పోలి ఉంటుంది. ఇది కార్నింగ్  గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడింది ఇంకా ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియో తోకూడిన  ఒక 5.99 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగి ఉంది.  అలాగే ఈ డివైజ్ 2.2GHz ఆక్టా  కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు నిలువుగా అమర్చిన డ్యూయల్ – కెమెరా సెటప్ వెనుకభాగంలో ఉంటాయి.

ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఈ Mi A2 లో, 1.25 – మైక్రాన్  పిక్సల్స్ అందించగల ఒక 12MP సోనీ IMX486 సెన్సార్ కెమేరా ప్రధానమైందిగాను మరియు  మరొక 20MP సోనీ IMX376 సెన్సార్ ద్వితీయ కెమేరాగాను కలిగి ఉంది.  ఇది పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి చక్కగా అనుమతిస్తుంది. ఈ రెండు లెన్సులుకూడా f /1.75 ఎపర్చరును కలిగి ఉంటాయి. ముందు భాగంలో, షియోమీ యొక్క సూపర్ పిక్సెల్ టెక్నాలజీగల 20MP  సోనీ IMX376 సెన్సార్  కెమెరాని అందించారు. అలాగే ఇది క్విక్ ఛార్జ్ 4+ కు మద్దతు ఇచ్చే ఒక 3,000 mAh బ్యాటరీతో, ఈ హ్యాండ్సెట్ మద్దతు ఇస్తుంది. ఈ డివైనులో,  ఒక 3.5mm హెడ్ఫోన్ మాత్రం  మీరు మిస్ అవుతారు అయితే దీనికి బదులుగా, ఇది ఒక USB టైప్- C పోర్ట్ కలిగి వస్తుంది.

ఆండ్రాయిడ్ Oreo OS తో ఈ  స్మార్ట్ ఫోన్ నడుస్తుంది, ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమం కింద ప్రారంభించబడింది కాబట్టి, వినియోగదారులకు గూగుల్ క్లౌడ్, నెలసరి భద్రతా అప్డేట్స్ మరియు  రెండు అతిపెద్ద OS అప్డేట్స్ ద్వారా అపరిమితమైన అధిక-నాణ్యత గల ఫోటోలను స్టోరేజీ చేసే అవకాశం లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo