షావోమి Mi A2 కేవలం రూ.9,999 మాత్రమే
ఇప్పుడు Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందిస్తున్న Month - End Mobile Festive సేల్ నుండి Mi A2 స్మార్ట్ ఫోన్ పైన Best ఆఫరును అందించింది.
మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లు సరికొత్త ఫీచర్లతో సందడి చేస్తుండడంతో, ముందుగా వచ్చిన కొన్ని స్మార్ట్ ఫోన్ల ధరలు ఊహించనంతగా పడిపోయాయి. అలాగే, మరికొన్ని స్మార్ట్ ఫోన్ల పైన ఎక్స్ట్రా డిస్కౌంట్లు, ఇంకొన్ని స్మార్ట్ ఫోన్ల యొక్క ఎక్స్చేంజి పైన ఎక్స్ట్రా డిస్కౌంట్లు వంటి ఆఫర్లతో అందిస్తున్నాయి. ఇప్పుడు Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందిస్తున్న Month – End Mobile Festive సేల్ నుండి Mi A2 స్మార్ట్ ఫోన్ పైన కూడా అటువంటి ఆఫరును అందించింది.
Surveyముందుగా, 15,999 ధరతో వచ్చినటువంటి, Mi A2 స్మార్ట్ ఫోన్ పైన అనేకసార్లు డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ, ఇది 11,999 ధర వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది. కానీ, కానీ ఇప్పుడు ఈ Month – End Mobile Festive సేల్ ద్వారా ఈ ఫోన్ పైన ప్రకటించిన ఎక్స్ట్రా ఎక్స్చేంజి బోనస్ ఆఫరుతో దీని కొనుగోలు పైన 2,000 రూపాయల ఎక్కువ లాభాన్ని అందిస్తుంది. అంటే, ఎక్స్చేంజి ఆఫరు క్రింద ఇచ్చిన 2,000 బోనస్ ని తగ్గిస్తే, ఇది కేవలం రూ.9,999 ధరకే అందుతుంది.
షావోమి Mi A2 స్పెసిఫికేషన్స్
డిజైన్ పరంగా, మీ ఎ2 రెడ్ మీ నోట్ 5 ప్రో ను పోలి ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడింది ఇంకా ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియో తోకూడిన ఒక 5.99 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగి ఉంది. అలాగే ఈ డివైజ్ 2.2GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు నిలువుగా అమర్చిన డ్యూయల్ – కెమెరా సెటప్ వెనుకభాగంలో ఉంటాయి.
ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఈ Mi A2 లో, 1.25 – మైక్రాన్ పిక్సల్స్ అందించగల ఒక 12MP సోనీ IMX486 సెన్సార్ కెమేరా ప్రధానమైందిగాను మరియు మరొక 20MP సోనీ IMX376 సెన్సార్ ద్వితీయ కెమేరాగాను కలిగి ఉంది. ఇది పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి చక్కగా అనుమతిస్తుంది. ఈ రెండు లెన్సులుకూడా f /1.75 ఎపర్చరును కలిగి ఉంటాయి. ముందు భాగంలో, షియోమీ యొక్క సూపర్ పిక్సెల్ టెక్నాలజీగల 20MP సోనీ IMX376 సెన్సార్ కెమెరాని అందించారు. అలాగే ఇది క్విక్ ఛార్జ్ 4+ కు మద్దతు ఇచ్చే ఒక 3,000 mAh బ్యాటరీతో, ఈ హ్యాండ్సెట్ మద్దతు ఇస్తుంది. ఈ డివైనులో, ఒక 3.5mm హెడ్ఫోన్ మాత్రం మీరు మిస్ అవుతారు అయితే దీనికి బదులుగా, ఇది ఒక USB టైప్- C పోర్ట్ కలిగి వస్తుంది.