షియోమీ మీ ఎ2 మొదటి ఫ్లాష్ సేల్ ఈ రోజు 12 PM నుండి: ధర, విడుదల ఆఫర్లు,స్పెక్స్ మరియు మీకు కావాల్సిన మొత్తం సమాచారం

షియోమీ మీ ఎ2 మొదటి ఫ్లాష్ సేల్ ఈ రోజు 12 PM నుండి: ధర, విడుదల ఆఫర్లు,స్పెక్స్ మరియు మీకు కావాల్సిన మొత్తం సమాచారం
HIGHLIGHTS

షియోమీ మీ ఎ2 ఫోన్ ఈ రోజు 12 Pm నుంచి అమెజాన్ మరియు మీ.కామ్ నుండి ఆన్లైన్ లో కొనడానికి అందుబాటులో ఉంటుంది. అయితే ఆఫ్ లైన్ మాత్రం మీ హోమ్స్ మరియు కంపెనీ సూచించిన స్టోర్స్ లో మాత్రమే అందేవీలుంది.

షియోమీ ఇటీవల దాని రెండవ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్నివిడుదల చేసింది . ఈ మీ ఏ 2 భారతదేశం లో,  అమెజాన్ మరియు మీ.కామ్ నుండి ఆన్లైన్ లో మరియు ఆఫ్ లైన్ లో మాత్రం మీ హోమ్స్ మరియు కంపెనీ సూచించిన స్టోర్స్ లో నేడు 12PM నుండి  మొదటిసారి అమ్మకాని కోసం అందించనున్నారు. ఇది తన ముందుతరం మీ ఏ 1, వలే  షియోమీ మీ ఎ2 ఫోన్  కూడా స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో  నడుస్తుంది మరియు గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ కార్యక్రమంలో భాగంగా ఉంది, దీని అర్థం సకాలంలో OS మరియు భద్రతా అప్డేట్  స్వీకరించేది. ఈ సంవత్సరం తర్వాత  విడుదల అయినప్పుడు ఆండ్రాయిడ్  పై అప్డేట్  అందుకోనున్న మొదటి ఫోన్ల లో  మీ ఏ 2కూడా ఒకటి. ఈ ఫోన్ గత వారంలో భారతదేశంలో ప్రకటించబడింది మరియు ప్రీ – ఆర్డర్లు కోసం ఇప్పటి వరకు అందుబాటులో ఉంది.

షియోమీ మీ ఎ2 ధర మరియు విడుదల ఆఫర్స్

షియోమీ తన మీ ఏ 2 యొక్క 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజి వేరియెంట్ ని మాత్రమే ఇండియాలో విడుదల చేసింది. ఈ షియోమీ మీ ఎ2 యొక్క ధర రూ . 16,999 నుండి ప్రారంభమవుతుంది. కంపెనీ ఒక 6జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజి వేరియంట్ ని కొన్ని రోజుల తరువాత అందుబాటులోకి తేవాలని చూస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్,గోల్డ్,లేక్ బ్లూ మరియు రోజ్ గోల్డ్ రంగుల మోడళ్లతో ఈ రోజు కొనడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలుతో రిలయన్స్ జియో వినియోగదారులకు రూ . 2,200 ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ తో పాటుగా 4.5 టీబీ అదనపు డేటా కూడా ఆఫర్ గా అందుతుంది. ఇంకా కొంతమంది 3-నెలల హంగామా మ్యూజిక్ సబ్స్క్రిప్సన్ ఈ డివైజ్ లో ఆఫర్ కింద పొందే వీలుంది.

షియోమీ మీ ఎ2 స్పెసిఫికేషన్స్

డిజైన్ పరంగా, మీ ఎ2 రెడ్ మీ నోట్ 5 ప్రో (సమీక్ష) ను చాలా పోలి ఉంటుంది. ఇది కార్నింగ్  గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడింది ఇంకా ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియో తోకూడిన  ఒక 5.99 అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లేని కలిగి ఉంది.  అలాగే ఈ డివైజ్ 2.2GHz ఆక్టా  కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు నిలువుగా అమర్చిన డ్యూయల్ – కెమెరా సెటప్ వెనుకభాగంలో ఉంటాయి.

ఆప్టిక్స్ పరంగా చుస్తే, ఈ మీ ఏ 2 లో 1.25 – మైక్రాన్  పిక్సల్స్ తో కూడిన సోనీ IMX486 సెన్సార్ తో  12ఎంపీ కెమేరా ప్రధానమైందిగాను మరియు  సోనీ IMX376 సెన్సార్ 20ఎంపీ ద్వితీయ కెమేరాగాను కలిగి ఉంది.  ఇది పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి  అనుమతిస్తుంది. రెండు లెన్సులుకూడా f /1.75 ఎపర్చరును కలిగి ఉంటాయి. ముందు భాగంలో,షియోమీ యొక్క సూపర్ పిక్సెల్ టెక్నాలజీతో సోనీ IMX376 సెన్సార్  20ఎంపీ కెమెరాని అందించారు. అలాగే ఇది క్విక్ ఛార్జ్ 4+ కు మద్దతు ఇచ్చే 3,000 mAh బ్యాటరీతో హ్యాండ్సెట్ మద్దతు ఇస్తుంది. డివైజ్ ఒక 3.5mm హెడ్ఫోన్ జాక్ ఇందులో మీరు మిస్ అవుతారు అయితే దీనికి   బదులుగా, ఇది ఒక USB టైప్- C పోర్ట్ కలిగి వస్తుంది.

ఆండ్రాయిడ్ Oreo OS తో ఈ  స్మార్ట్ ఫోన్ నడుస్తుంది, ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమం కింద ప్రారంభించబడింది కాబట్టి, వినియోగదారులకు గూగుల్ క్లౌడ్, నెలసరి భద్రతా అప్డేట్స్ మరియు కనీసం త్వరలో రానున్న రెండు అతిపెద్ద OS అప్డేట్స్ ద్వారా అపరిమితమైన అధిక-నాణ్యత ఫోటో స్టోరేజీ చేసే అవకాశం లభిస్తుంది. షియోమీ మీ ఎ2 మొట్టమొదటిసారిగా మాడ్రిడ్లో ప్రారంభించబడింది, స్పెయిన్ తో పాటుగా యూరప్ మొత్తంలో తన ఉనికిని విస్తరించడానికి చూస్తోంది ఇప్పుడు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo