xiaomi కొత్త మోడల్, Mi 4C కన్ఫర్మ్ చేసిన కంపెని ఫౌండర్
రెండు వేరియంట్స్ లో సెప్టెంబర్ 22 న వస్తుంది.
సెప్టెంబర్ 22 న xiaomi కో ఫౌండర్, Lin Bin కొత్త మోడల్ Mi 4C ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు ఈ రోజు. ఇది 2gb ర్యామ్ – 16gb స్టోరేజ్ మరియు 3gb ర్యామ్ – 32gb స్టోరేజ్ ఆప్షన్స్ లో వస్తుంది.
Surveyగత నెలలో TENAA ద్వారా మి 4c ఇమేజెస్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యి బాగా హల చల్ చేసాయి. ఇమేజెస్ తో పాటు 1.4GHz hexa కోర్ స్నాప్ డ్రాగన్ 808 SoC, 5 in FHD డిస్ప్లే, 2gb ర్యామ్, 16gb స్టోరేజ్, 13mp – 5mp కేమేరాస్ ఉంటాయని రిపోర్ట్ చేసింది TENAA ఆన్ లైన్ వెబ్ సైట్.
ఈ నెల ఆరంభంలో మరోసారి, మి 4C ఫోన్ యొక్క రిటేల్ బాక్స్ పిక్స్ లీక్ అయ్యాయి. దానితో TENAA గతంలో చెప్పిన స్పెక్స్ నిజమని కొంత రుజువు అయ్యింది. దీనిలో usb టైప్ c పోర్ట్ అండ్ 3080 mah బ్యాటరీ కూడా ఉన్నట్లు కనిపించింది.
ఇది కాక xiaomi లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్, మి 5 ను కూడా త్వరలో లాంచ్ చేయనుంది. దీనిలో 4gb ర్యామ్, క్వాడ్ HD 5.3 in డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియా టెక్ Helio x20 ప్రొసెసర్ వంటి స్పెక్స్ ఉంటాయని రూమర్స్.
Writer, gamer, and hater of public transport. View Full Profile
