Xiaomi Mi 4 16GB ధర 14.999 రూ లకు తగ్గింది

HIGHLIGHTS

ఇంతకముందు 18,999 రూ ఉండేది.

Xiaomi Mi 4 16GB ధర 14.999 రూ లకు తగ్గింది

Xiaomi మి 4 మోడల్ 16 జిబి స్టోరేజ్ వెర్షన్ నాలుగు వేలు తగ్గింది. తాజాగా కంపెని 1 కోటి మి 4 ఫోనులను అమ్మినందుకు ఈ డిస్కౌంట్ ఇస్తుంది. అయితే ఇది పర్మేనేంట్ ప్రైస్ కట్. ఇంతకముందు 18,999 రూ లకు అమ్మకం అయిన Xiaomi మి 4 ఇప్పుడు 14,999 రూ లకు దొరుకుతుంది. అయితే ఈ ధర తగ్గింపు కేవలం ఫ్లిప్ కార్ట్ సైటు లోనే అమలులో ఉంది. ఇదే 16 జిబి మోడల్ ఎక్స్చేంజ్ ఆఫర్ తో కూడా వస్తుంది. దీనికి ముందే Xiaomi మి 4 64 జిబి మోడల్ ను కూడా 19,999 రూ లకు ధర తగ్గించింది.
                           

Digit.in Survey
✅ Thank you for completing the survey!

తాజాగా మి 4 16 జిబి ప్రైస్ తగ్గింపు తో  ఫోన్ కచ్చితంగా మంచి సేల్స్ కు టార్గెట్ కానుంది. OnePlus వన్ మోడల్ కు దీనికి దాదాపుగా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నందు వలన అందరూ మి 4 కు మొగ్గు చూపించే అవకాశం ఉంది. కానీ దీనిలో మన ఇండియన్ యూజర్స్ ఎక్కువుగా పట్టించుకునే డ్యూయల్ సిమ్ ఆప్షన్ లేదు. అలాగే మైక్రో ఎస్డి కార్డ్ సదుపాయం ఇందులో లేదు. ఆ రెండు ఫోనుకు నిజంగా మైనస్.

Xiaomi మి 4 స్పెసిఫికేషన్స్ – క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 SoC. ఈ క్వాడ్ కోర్ ప్రోసెసర్ ఒక సంవత్సరం క్రిందటిది అయినప్పటికీ, ప్రస్తుత ఫ్లాగ్ షిప్ మోడల్స్ అన్నిటిలో ఇదే ఉంది. మి 4 లోని హైలైట్ స్పెక్, 3జిబి ర్యామ్. మల్టీ టాస్కింగ్ కు ఇది చాలా ఎక్కువ. 

13MP బ్యాక్  కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, 5in 1080P IPS LCD డిస్ప్లే. ఇది బెస్ట్ డిస్ప్లే ఉన్న ఫోనుల్లో ఒకటి. మంచి డిజైన్ మరియు అల్యూమినియం ఫ్రేమ్ ఫోన్ కు ప్రీమియం లుక్స్ ను ఇస్తుంది. అయితే Xiaomi మి 4 కు కాంపిటేటర్ గా ఉన్న OnePlus వన్ కంపెని  కూడా  64 జిబి మోడల్19,998 రూ లకు ధర తగ్గించింది.

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo