మార్చి 31 కి రానున్న షావోమి Mi 10 5G మరియు 108MP కెమేరా ఫోన్

మార్చి 31 కి రానున్న షావోమి Mi 10 5G మరియు 108MP కెమేరా ఫోన్
HIGHLIGHTS

ఈ ఫోనులో ఒక 108MP ప్రధాన కెమెరా ఇవ్వబడింది.

ఇండియాలో తన మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ గురించిన టీజర్ అందించిన షావోమి. షావోమి , మార్చి 31 వ తేదికి తన 5G ఫోన్ అయినటువంటి Mi 10 స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చెయ్యడానికి తేదీని ప్రకటించింది. అంతేకాదు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి ఏప్రిల్ 7 వ తేది రాత్రి 11 గంటల 59 నిముషాల వరకూ ప్రీ అర్దార్లను కూడా చేసుకోవచ్చని ప్రకటిస్తోంది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ను చైనాలో ముందుగా విడుదల చేసింది. ఇక ఇండియాలో కూడా అదే ఫోనును తీసుకొస్తుందా లేక మరింకేదైనా మార్పులను చేస్తుందా? అని తెలుసుకోవడానికి ఫోన్ విడుదలయ్యే వరకూ వేచిచూడల్సిందే. అంతేకాదు, అమేజాన్ ఇండియా ఇప్పటికే ఒక మైక్రో సైట్ ద్వారా కూడా ఈ లాంచ్ ఈవెంట్ గురించిన టీజింగ్ గురించి చూపిస్తోంది. కాబట్టి, ఈ ఫోన్ అమేజాన్ ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా సేల్ కావచ్చు.                 

చైనాలో విదుహాల్ చేసిన షావోమి మి 10 యొక్క అత్యంత ప్రత్యేక లక్షణాలు

షావోమి మి 10 స్మార్ట్‌ ఫోన్(చైనా)  యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోన్ ఒక 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే 1120 నిట్ల బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోనులో మీకు సింగిల్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్ లభిస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ తో స్క్రీన్‌ ను కలిగివుంది. ఇది కాకుండా, మీరు 180Hz టచ్ శాంప్లింగ్ రేటును కూడా పొందుతారు. ఇది వేగవంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 తో SoC తో విడుదల చెయ్యబడింది.

ఈ స్మార్ట్‌ ఫోనులో ఒక 4780 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని, 30W వైర్డ్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో అందించారు. మీరు ఈ 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇందులో చూడవచ్చు. ఇది కాకుండా, ఈ 4500mAh సామర్థ్యం గల బ్యాటరీతో పాటు, ఫోన్ యొక్క అనుకూల వెర్షన్‌లో మీకు 50W ఛార్జింగ్ మద్దతు లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌లో వై-ఫై 6 యొక్క మద్దతును కూడా అందుకుంటారు.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోనులో ఒక 108MP ప్రధాన కెమెరా ఇవ్వబడింది. ఇది ఐసోసెల్ బ్రైట్ HMX సెన్సార్, దీనిని శామ్‌సంగ్ తయారు చేస్తుంది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోనులోని వెనుక కెమెరాలో మీకు 13MP  సెన్సార్ మరియు రెండు 2 ఎంపి సెన్సార్లు కూడా ఉంటాయి. ఈ ఫోన్ ముందుభాగంలో మీరు 20MP సెన్సార్ సెల్ఫీ కెమెరాగా ఇవ్వబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo