షావోమి పోకో F1 పైన భారీ క్యాష్ బ్యాక్ అఫర్ ప్రకటించిన షావోమి

షావోమి పోకో F1 పైన భారీ క్యాష్ బ్యాక్ అఫర్ ప్రకటించిన షావోమి
HIGHLIGHTS

ఈ అఫర్ కేవలం mi.com మరియు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారల పైన మార్చి 25 నుండి 28 వ తేదీ వరకు మాత్రమే.

షావోమి యొక్క ఉపబ్రాండ్ అయినటువంటి Poco యొక్క ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి Poco F1 పైన క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. ఈ  అఫర్ కేవలం mi.com  మరియు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారల పైన మార్చి 25 నుండి 28 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్, మధ్య స్థాయి ధరలో ప్రీమియం ఫిచర్లను అందితుంది మరియు ఇది క్వాల్కమ్ యొక్క ప్రధాన ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 845 SoC తో నడుస్తుంది మరియు 8GB ర్యామ్ సామర్ధ్యం వరకు అందించబడుతుంది. అంటే మీకు 2000 నుండి 3000 రూపాయల క్యాష్ అందుతుంది ఈ ఫోన్ యొక్క వేరియంట్ ఆధారంగా.  

Xiaomi Poco F1  ప్రస్తుత ధరలు :      

షావోమి పోకో F1 ( 6GB + 128GB ) వేరియంట్ : ప్రస్తుత ధర – Rs.22,999   

షావోమి పోకో F1 ( 8GB + 256GB ) వేరియంట్ : ప్రస్తుత ధర – Rs.27,999   

Xiaomi Poco F1  అఫర్ ధరలు :      

షావోమి పోకో F1 ( 6GB + 128GB ) వేరియంట్ : ప్రస్తుత ధర – Rs.20,999   

షావోమి పోకో F1 ( 8GB + 256GB ) వేరియంట్ : ప్రస్తుత ధర – Rs.24,999   

ఇక సాధారణ వేరియంట్ అయినటువంటి  షావోమి పోకో F1 యొక్క  6GB + 64 GB  వేరియంట్ పైన 2,000 రుపాయల క్యాష్ అఫర్ అందిచనుండి Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన మార్చి 25 నుండి 28 వ తేదీ వరకు మాత్రమే.

Poco F1 ప్రత్యేకతలు

ఈ Poco F1 ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ఆక్టా-కోర్ ప్రాసెసర్ చేత శక్తినిస్తుంది మరియు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది, ఈ టెక్నాలజీ, ముఖ్యంగా ఫోన్ వినియోగ సమయంలో CPU ను చల్లబరచడానికి సహాయపడే ఒక రాగి గొట్టం కలిగివుంటుంది . ఈ స్మార్ట్ ఫోన్ 19: 9 యొక్క రిజల్యూషన్ తో ఒక 6.18-అంగుళాల ఫుల్  HD + IPS LCD డిస్ప్లే మరియు పైన ఒక 'నోచ్' కలిగిఉంది. డిస్ప్లే పైన ఉండే ఈ నోచ్,  లైటింగ్ సెన్సార్, ఇయర్ పీస్, ఒక 20MP కెమెరా మరియు లోపల ఒక సన్నిహిత సెన్సార్ కలిగివుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక 4000mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు స్పీడ్ ఛార్జ్ 3.0 సాంకేతికతతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, Poco F1 వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ప్రాధమిక కెమెరాలో f / 1.8 ఎపర్చర్, డ్యూయల్ పిక్సెల్ PDAF టెక్నాలజీ, రియల్ టైమ్ AI ఫోటోగ్రఫి, 25 కేటగిరీలు, AI బ్యాక్లైట్ డిటెక్షన్ మరియు పోర్ట్రెయిట్ మోడ్లలో 209 సన్నివేశాలను గుర్తించే సామర్ధ్యంతో 12MP సోనీ IMX 363 సెన్సార్ను కలిగి ఉంది. ద్వితీయ కెమెరాగా 5MP సెన్సార్ను కలిగి ఉంది. ఫోన్లో రెండు స్పీకర్లు ఉన్నాయి: ఒకటి క్రింద ఉంది మరియు మరొకటి ఈయర్ పీస్ లో  ఉంది. ఇవి రెండు కూడా డిరాక్ HD సౌండ్తో డ్యూయల్ స్మార్ట్ పవర్ యాంప్లిఫైయర్ను కలిగివున్నాయి.

ఇంకా ఇది widevine ద్రువీకరణతో వస్తుంది. అంటే Netflix వంటి ప్లాట్ఫారల పైన HD కంటెంట్ వీడియోలను చూడవచ్చు. అదనంగా, ఇది ఒక గేమ్ టర్బో మోదుతో వస్తుంది కాబట్టి, గేమింగ్ సమయంలో ఈ ఫోన్ మీకు అత్యంత వేగంగా పనిచేసేలా చేస్తుంది.           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo