Xiaomi 18 Pro: భారత్ లోకి షావోమీ కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ ఎంట్రీకి సిద్ధం .. అంచనాలకు మించి ఉంటుందా.!
షావోమీ త్వరలో భారత మార్కెట్లో మరో ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది
Xiaomi 18 Pro లాంచ్ ను కంపెనీ ఇప్పటికే ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 వేదికగా ధృవీకరించింది
ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.4 అంగుళాల 1.5K OLED డిస్ప్లే ఉంటుందని భావిస్తున్నారు
Xiaomi 18 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ త్వరలో భారత మార్కెట్లో మరో ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే, Xiaomi 18 Pro స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ను కంపెనీ ఇప్పటికే ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 వేదికగా ధృవీకరించింది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ 2027 జనవరి మొదటి వారంలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, లాంచ్ తేదీ మరియు ధర వివరాలు పైన కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Xiaomi 18 Pro: లాంచ్ డేట్
ప్రముఖ టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, షావోమి 10 ప్రో స్మార్ట్ ఫోన్ జనవరి మొదటి వారంలో భారత్ లో విడుదల కావచ్చు. అలాగే, రెండో వారంలో ఈ ఫోన్ సేల్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ధర సుమారు రూ.1.5 లక్షల వరకు ఉండవచ్చని అంచనా కూడా వేస్తున్నారు.
మరో ప్రముఖ టిప్ స్టర్ యోగేష్ బ్రార్ జనవరి 5న ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి లీకులు మాత్రమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచిచూడాల్సిందే.
Xiaomi 18 Pro: ఫీచర్స్ చైనా వేరియంట్
చైనా వేరియంట్ ఆధారంగా, ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.4 అంగుళాల 1.5K OLED డిస్ప్లే ఉంటుందని భావిస్తున్నారు.ఈ ఫోన్ లో వెనుక వైపు 2.66 అంగుళాల సెకండరీ OLED డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite Gen 6 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. ఈ ఫోన్ Android 17 ఆధారిత Hyper OS 4 ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చే అవకాశం ఉంది.
ఫోటోగ్రఫీ కోసం 200MP OIS మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా ఉండొచ్చని సమాచారం. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ లో 7,000mAh భారీ బ్యాటరీ ఉండనుందని సమాచారం. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి.