Xiaomi 11 Lite NE 5G: భారీ దివాళీ ఆఫర్లతో ఈరోజే లాంచ్.. ఫీచర్లు ఎలా వున్నాయంటే..!

Xiaomi 11 Lite NE 5G: భారీ దివాళీ ఆఫర్లతో ఈరోజే లాంచ్.. ఫీచర్లు ఎలా వున్నాయంటే..!
HIGHLIGHTS

భారీ ఆఫర్లతో వచ్చిన Xiaomi 11 Lite NE 5G

పూర్తి 12 5G బ్యాండ్ సపోర్ట్ తో వచ్చింది

Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్

చాలాకాలంగా వార్తల్లో నిలిచిన Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదలయ్యింది. షియోమి యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ చాలా సన్నగా మరియు తేలికగా ఉంటుంది. జూన్ నెలలో మార్కెట్లోకి వచ్చిన Xiaomi Mi 11 Lite స్మార్ట్ ఫోన్ 4G తో ఉండగా ఈ Xiaomi 11 Lite NE 5G పూర్తి 12 5G బ్యాండ్ సపోర్ట్ తో వచ్చింది. ఈ ఫోన్ డిజైన్, కెమెరా మరియు మరిన్ని విషయాలలో బాగా ఆకట్టుకుంటుంది. ఇది ఈ సెగ్మెంట్ లో Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ గల 10 బిట్ స్మార్ట్ ఫోన్ అని షియోమి చెబుతోంది. మరి ఈ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు కంప్లీట్ వివరాలను తెలుసుకుందామా.

Xiaomi 11 Lite NE 5G: ధర

Xiaomi 11 Lite NE 5G యొక్క 6GB మరియు 128GB బేస్ వేరియంట్ రూ.26,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ రూ.28,999 ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. స్పెషల్ దివాళీ అఫర్ క్రింద ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ దివాళీ సేల్ సమయంలో రూ.23,499 రూపాయల ప్రారంభ ధర నుండి కొనుగోలు చేసే వీలుంది. ఈ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ అర్ధరాత్రి 12 గంటల నుండి లభిస్తుంది. ఇది డైమండ్ డాజిల్, టస్కనీ కొరల్, జాజ్ బ్లూ మరియు వినైల్ బ్లాక్ అనే నాలుగు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.      

Xiaomi 11 Lite NE 5G: స్పెక్స్

మి 11 లైట్ NE 5G లో ఒక 6.55-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 90Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్ లో Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ గల 10 బిట్ స్మార్ట్ ఫోన్ అని షియోమి చెబుతోంది. మి 11 లైట్ NE 5G కేవలం 6.8 మిల్లీమీటర్ల మందం మరియు అతితక్కువ 158 గ్రాముల బరువు ఉంటుంది.

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ న్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 G ప్రోసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు జతగా 8GB RAM వరకు మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఈ ఇది MIUI 12.5 పై పనిచేస్తుంది మరియు ఇది 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.  

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ మి 11 లైట్ NE 5G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో, 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా -వైడ్ యాంగిల్ కెమెరా మరియు 5 MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది పంచ్-హోల్ నాచ్ కటౌట్ లోపల ఉంది.

ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ వుంది. అలాగే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు  4,250 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజి సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo