VOOC 3.0 మరియు హైపర్ బూస్ట్ కలయికతో, Oppo F11 Pro ను ఒక మంచి గేమింగ్ ఫోనుగా చేస్తాయి

VOOC 3.0 మరియు హైపర్ బూస్ట్ కలయికతో, Oppo F11 Pro ను ఒక మంచి గేమింగ్ ఫోనుగా చేస్తాయి
HIGHLIGHTS

OPPO యొక్క కొత్త VOOC 3.0 ఛార్జింగ్ సాంకేతికత వోల్టేజ్ శాతాన్ని తగ్గించడం ద్వారా ఛార్జింగ్ వేగం పెంచుతుంది, తద్వారా ఛార్జ్ చేయడానికి 20 నిమిషాల సమయం ఆదా చేస్తుంది.

ప్రస్తుత కాలంలో, స్మార్ట్ ఫోన్లు అనేవిలేకుండా మన జీవితాలను ఊహించలేము. ఈ పాకెట్-సైజ్ టెక్ యొక్క అద్భుతాలు అన్ని ఇన్ని కావు, అనేక విషయాలలో  సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు ప్రతి సంవత్సరం ఉత్తమంగా మార్పు చెందుతూ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ, ఆధునిక హ్యాండ్సెట్లు అధిక రిజల్యూషన్ డిస్ప్లేలు, పెద్ద కెమెరా సెటప్, మరియు చాలా సన్నని బాడిలో డిజైన్ తో  ఆకట్టుకునే ప్రదర్శన అందించే ఒక అంతిమ స్థానానికి చేరుకుంది. స్మార్ ఫోన్లు పరిమితమైన బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటాయి మరియు వాటిని  క్రమం తప్పకుండా ఛార్జ్ చేయాలి. ఈ ఛార్జింగ్ ప్రక్రియ కోసం సాధారణంగా కొంచెం సమయం పడుతుంది, మీరు గనుక ఆతృతగా వ్యవహరిస్తే, మీ బ్యాటరీ తక్కువగా ఛార్జ్ అవుతుంది మరియు తరువాత మీకు ఇది చాలా అవాంతరం కావచ్చు. అయితే, OPPO F11 ప్రో యొక్క VOOC 3.0 వంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇటువంటి ఇబ్బందిని చెరిపేస్తుంది.

 

 

వాస్తవానికి VOOC అంటే,  వోల్టేజ్ ఓపెన్ లూప్ మల్టీ-స్టెప్ కాన్స్టాంట్-కరెంట్ ఛార్జింగ్ అని సూచిస్తుంది మరియు ఇది 2018 లో OPPO ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఛార్జింగ్ కోసం పరిష్కారంగా వేగవంతమైన ఛార్జింగ్ తో ఇది అందించబడింది, కానీ దీని ఎటువంటి తీవ్రస్థాయి ప్రమాదం లేకుండా సురక్షితంగా అందించింది. ఇప్పుడు, F11 ప్రో విడుదలతో ప్రవేశపెట్టిన VOOC 3.0 టెక్నాలజీ, అందులోని 4,000mAh సామర్థ్యాన్నికలిగివున్న బ్యాటరీని మిగిలిన అన్ని హ్యాండ్ సెట్ల కాంటే అత్యంత వేగంగా ఛార్జ్ చేయగలదు.

OPPO యొక్క కొత్త VOOC 3.0 ఛార్జింగ్ సాంకేతికత వోల్టేజ్ శాతాన్ని తగ్గించడం ద్వారా  ఛార్జింగ్ వేగం పెంచుతుంది, తద్వారా ఛార్జ్  చేయడానికి 20 నిమిషాల సమయం ఆదా చేస్తుంది.

వేగవంతమైన ఛార్జింగ్ అనేది ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్లలో కోరుకునే ఒక ముఖ్య లక్షణం. VOOC 3.0 తో, మీరు ఇక ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి గంటలు వేచి  ఉండాల్సిన అవసరముండదు. ఒక చిన్న చార్జింగ్ సమయం కూడా కొన్ని గంటల టాక్ టైమ్ కోసం సరిపోతుంది.

ఈ ఫీచర్ వారి స్మార్ట్ ఫోన్లలో అధికంగా గేమ్స్ కోసం ఉపయోగించే, మొబైల్ గేమర్లకు కూడా చాలా గొప్పగా ఉంటుంది. PUBG మొబైల్ వంటి ఆధునిక గేమ్స్ చాలా త్వరగా బ్యాటరీని హరించగల శక్తిని కలిగి ఉంటుంది. కొన్నిసార్లు, బ్యాటరీ చార్జ్ చేస్తున్నదాని కంటే అధికంగా ఖర్చు అవుతుంటుంది. కాబట్టి అటువంటి  సమయంలో ఫోన్ ఛార్జింగ్ తగినంత ఉండకపోవచ్చు. అదే సమయంలో, VOOC 3.0తో  వారు వారి ఫోన్లను ఛార్జ్ చేస్తున్నప్పుడు, వారు ఎప్పటికప్పుడు ప్లే చేయగలిగేలా గేమర్ల కోసం అందంగా ఉపయోగపడతాయి.

నిజానికి, OPPO F11 ప్రో స్మార్ట్ ఫోన్ గేమర్ల కోసం చాలనే ప్రత్యకమైన లక్షనాలను కలిగి ఉంటుంది. అయితే, వీటిలో అత్యంత ముఖ్యమైనదిగా HyperBoost గురించి చెప్పొచ్చు. ఈ చిన్న లక్షణం గేమింగ్ సెషన్ కోసం ఫోన్ను ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ లక్షణం మెమొరీని ఆప్టిమైజ్ చేస్తుంది అందువల్ల ఆట కోసం అందుబాటులో ఉన్న మొత్తం RAM ను సమకూర్చగలదు. ఇది లోడ్ వేగం మెరుగుపరచబడుతుంది, కాబట్టి ఆట లోడ్ అవడం కోసం మీరు వేచిఉండాల్సిన అవసరం ఉండదు. హైపర్ బూస్ట్ కూడా పెరుగుతుంది, టచ్ సున్నితత్వం కూడా పెరుగుతుంది, తద్వారా మీ ఫోన్ ఒక టచ్ ను నమోదు చేయడానికి నిరాకరించడు కాబట్టి  మీరు గేమింగ్ సమయంలో ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. గేమ్ ప్లే అసిస్టెంట్, గేమ్ స్పేస్ మరియు గేమ్ స్పీచ్ ఎన్హాన్మెంట్ వంటి ఇతర లక్షణాలను మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి కూడా హైపర్ బూస్ట్  అందిస్తుంది.

 OPPO F11 ప్రో మీడియా టెక్ యొక్క హెలియో P70 చిప్సెట్ ద్వారా ఆధారితమైనది. ఇది ARM మాలి- G72 GPU తో ఒక ఆక్టా  కోర్ CPU,అంటే  ఇది మునుపటి P60 నుండి మెరుగుపరుస్తుంది. ఈ తాజా Helio P70 దాని ముందు వచ్చిన వాటికంటే, గేమింగ్ సమయంలో మంచి పనితీరును అందిస్తుంది, డిమాండ్ గేమ్స్ లో మంచి ఫ్రేమ్ రేట్లకు భరోసా ఇస్తుంది.

ఒకటి మాత్రం చూడవచ్చు, P70 చిప్సెట్ మరియు హైపర్ బూస్ట్ కలయిక OPPO F11 ప్రో ని గేమర్స్ ఖచ్చితంగా పరిగణించాల్సిన, ఒక ఫోనుగా చేస్తుంది. ఈ, VOOC 3.0 అందిస్తున్న సౌకర్యంతో కలిపి, ఈ ఫోన్ చాలా ఆసక్తికరంగా, ఉంటుందని చెప్పవచ్చు.

 

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo