IP68 రేటింగ్ మరియు 3జీబీ రామ్ తో కూడిన LG Q7 రూ . 15,990 ధరతో విడుదల

IP68 రేటింగ్ మరియు 3జీబీ రామ్ తో కూడిన LG Q7 రూ . 15,990 ధరతో విడుదల
HIGHLIGHTS

ఈ LG Q7 స్మార్ట్ ఫోన్ సెప్టెంబరు 1 వ తేదీ నుండి అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

LG దాని Q సిరీస్ పోర్ట్ఫోలియో విస్తరించడం దృష్యా, LG ఎలక్ట్రానిక్స్ IP68 నీరు మరియు దుమ్ము రెసిస్టెన్స్, MIL -STD 810G మన్నికైన బిల్డ్, పోర్ట్రెయిట్ మోడ్, QLens మరియు DTS : X 3D సరౌండ్ సౌండ్ ఫీచర్స్ తో కేవలం 3GB RAM మరియు 32GB నిల్వ వేరియంట్ మాత్రమే వస్తుంది మరియు దీని ధర రూ .15,990 గా వుంది. సెప్టెంబర్ 1 నుండి అరోరా బ్లాక్ మరియు మొరాకో బ్లూ రంగు వేరియెంట్లలో అన్ని ప్రముఖ రిటైల్ అవుట్లెట్ స్టోర్లు అంతటా అందుబాటులో ఉంటుంది.

"మా ఉత్తమ – అమ్మకం Q సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టినందుకు మేము సంతోషిస్తున్నాము. ఇటీవల వచ్చిన LG G7 + ThinQ  లాగానే తాజా ప్రీమియం ఫీచర్లు కలిగిన క్వాలిటీ స్మార్ట్ఫోన్ ఇది . Q7 లక్షణాలు, రూపకల్పన, డిస్ప్లే మరియు ధరల గొప్ప కలయిక. ప్రీమియం లక్షణాలతో సమతుల్య స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు LG Q7 ని ఎంచుకోకుండా నిరోధించడం చాల కష్టతరం అని మేము విశ్వసిస్తున్నాం "అని   LG ఇండియా మొబైల్స్ బిజినెస్ – హెడ్ అయిన, అద్వాతి వైద్య ఒక ప్రకటనలో తెలిపారు.

LG Q7 స్పెసిఫికేషన్స్

LG Q7 గుండ్రని – అంచులతో ఒక 2.5D ఆర్క్ గ్లాస్ డిజైన్ కలిగి వస్తుంది మరియు ఒక మెటల్ బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంది. ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియాతో ఒక  5.5 అంగుళాల ఫుల్ HD + ఫుల్ విజన్ డిస్ప్లే (2160 x 1080 / 442ppi) ని కలిగి ఉంది. కెమెరా షట్టర్ బటన్గా డబల్స్ చేసే కెమెరా లెన్స్ క్రింద ఉన్న 'స్మార్ట్ రియర్ కీ' ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇంకా ఇది స్క్రీన్షాట్లను తీసుకోవడానికి మరియు నోటిఫికేషన్ బార్ని నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది.

ఆప్టిక్స్ ప్రకారం, LG Q7 ముందు ఒక 8ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ను కలిగి ఉంది మరియు ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF) సాంకేతికతతో వెనుకవైపు 13ఎంపీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లో కె – లెన్స్ తో కూడిన కెమెరా AI ఫీచర్ ఉంది, ఈ ఫీచర్ ప్రస్తుతం LG యొక్క ప్రీమియం స్మార్ట్ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. చిత్ర గుర్తింపు కోసం AI టెక్నాలజీని ఉండటంవల్ల,  QLens వినియోగదారులు కెమెరాను చిత్ర శోధన మరియు ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అనుమతిస్తుంది.

ఈ స్మార్ట్ఫోన్ ఒక మీడియా టెక్ MT6750S ఆక్టా – కోర్ ప్రాసెసర్ తో 1.5GHz వద్ద క్లాక్ మరియు Android Oreo OS తో నడుస్తుంది. Q7 DTS :X  3D సరౌండ్ సౌండ్ ని మరియు 7.1 ఛానల్ ఆడియోను హెడ్ఫోన్స్ ద్వారా అందిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో DTS: X ను అందించే ఫోన్లలో Q7 మొదటిది అని LG పేర్కొంది. Q7  3000 mAh బ్యాటరీతో కొంచెం వెనుకబడి వుంటుంది, కానీ సుమారు 60 నిమిషాల్లో 60 శాతానికి ఛార్జి చేయగలదని కంపెనీ నొక్కి చెబుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo