లెనోవో నుండి కొత్త ఫోన్ MOTO G4 రిలీజ్ అవుతుంది వచ్చే వారం
By
PJ Hari |
Updated on 13-May-2016
moto నుండి G4 అప్ కమింగ్ మోడల్ కన్ఫర్మ్ అయ్యింది అఫీషియల్ గా. కంపెని ట్విటర్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఫోన్ అమెజాన్ లో రిలీజ్ చేయనుంది.
Survey✅ Thank you for completing the survey!
ఫోన్ MAY 17 న రిలీజ్ కానుంది. ఇంతవరకు కంపెని ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ చేసింది ఫోన్లన్నిటినీ, ఇప్పుడు అమెజాన్ లో చేయనుంది. మోటోరోలా ను లెనోవో కంపెని కొనటం జరిగింది.
లెనోవో ఇప్పటి వరకూ లాంచ్ చేసిన ఫోన్లను చేసిన మార్పులను గమనిస్తే moto G4 పై ఇంకా ఎక్కువ అంచనాలు ఉంటున్నాయి. ఇప్పటివరకు కంపెని ఫింగర్ ప్రింట్ స్కానర్ ను ఇవ్వలేదు.
సో moto G4 లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది అని అంచనా. G4 ప్లస్ వేరియంట్ కూడా ఉంటుంది అని రిపోర్ట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఫోన్ కు సంబంధించి ఒక వైట్ కలర్ ఇమేజ్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది కూడా.