డిజిటల్ ప్రెమెంట్స్ కోసం Whatsapp Pay తెస్తోందా? ఫైన్షియల్ రంగంలోకి కూడా వస్తోందా? అసలు ఏమిటి సంగతి?
Whatsapp ఇండియాలో లోన్స్, ఇన్సూరెన్స్ మరియు మరికొన్నిఇతర సర్వీసులతో ఫైన్షియల్ రంగంలో అడ్గుగుపెట్టనుంది.
2018 నుండి టెస్టింగ్ లో వున్న Whatsapp Pay, ఇప్పుడు అతిత్వరలోనే వినియోగదారులకు అందనునట్లు కూడా తెలుస్తోంది.
ఈ విభాగంలో ఇప్పటికే Paytm, PhonePay మరియు Amazon Pay వంటి వాటికీ గట్టి పోటీకావచ్చు.
అందరికి సుపరిచితమైన మరియు అత్యధికంగా వాడకంలో వున్నా మెసేజింగ్ యాప్ Whatsapp, ఇప్పుడు ఇండియాలో కొత్త సర్వీస్ లోకి అడుగు పెట్టనున్నట్లు కనిపిస్తోంది. ఫేస్ బుక్ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రముఖ యాప్, ఇప్పుడు ఇండియాలో తన కొత్త సర్వీసులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. అదేమిటి అనుకుంటున్నారా? చాటింగ్, మీడియా లేదా వీడియో కాలింగ్ వంటివి కాదు, ఇండియాలో లోన్స్, ఇన్సూరెన్స్ మరియు మరికొన్నిఇతర సర్వీసులతో ఫైన్షియల్ రంగంలో అడ్గుగుపెట్టనుంది.
Surveyఅసలు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తుందో మనం చాలా సులభంగా అర్ధం చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియా యొక్క గణనీయమైన అభివృధి మరియు ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా, ఇండియాలో నానాటికి తారాస్థాయికి చేరుకుంటున్న డిజిటల్ పేమెంట్స్, ఇండియాలో వ్యాపారం చేయడానికి చూసే చూసేవారికి మంచి అవకాశాలను అందిస్తోంది. ఈ విభాగంలో, ఇప్పటికే Paytm, PhonePay మరియు Amazon Pay వంటి వాటితో పాటుగా మరిన్ని మంచి ప్రగతి సాధించిన విషయం తెలిసిందే.
ముందుగా ఈ విషయాన్ని బిజినెస్ ఇన్ సైడర్ నివేదించింది. ఈ నివేదిక ప్రకారం, మొదటగా Whatsapp ఇండియాలో Whatsapp Lending (రుణాలు), మైక్రో -ఇన్సూరెన్స్ మరియు మైక్రో -పెన్షన్ వంటి సర్వీస్ లను మొదలు పెట్టనునట్లు, Whatsapp ఇండియా హెడ్, అభిజిత్ బోస్ Global Fin tech Festival లో ఫైనాన్షియల్ సర్వీస్ లోకి రావడం గురించి వారి ఆలోచనలను మరియు ప్లాన్స్ కూడా షేర్ చేసినట్లు పేర్కొంది.
Whatsapp Pay
అంతేకాదు, 2018 నుండి టెస్టింగ్ లో వున్న Whatsapp Pay, ఇప్పుడు అతిత్వరలోనే వినియోగదారులకు అందనునట్లు కూడా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే, త్వరలోనే Whatsapp ఇండియన్ మార్కెట్లో తన ఫైనాన్షియల్ సర్వీసు లను మొదలు పెట్టవచ్చని అర్ధమవుతోంది. ఒకవేళా అదేగనుక నిజామైతే, ఇప్పటికే అన్ని స్మార్ట్ ఫోన్లల్లో పాటుకు పోయిన ఈ మెసేజింగ్ యాప్ మార్కెట్లోని ఇతర అన్ని యాప్స్ కి బయంకరమైన పోటీని ఇవ్వవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
