ఒక స్మార్ట్ ఫోనులో ‘డిస్ప్లే’ ప్రాధాన్యత ఏమిటి మరియు మీకు ఎటువంటి డిస్ప్లే సరిపోతుంది.

ఒక స్మార్ట్ ఫోనులో ‘డిస్ప్లే’ ప్రాధాన్యత ఏమిటి మరియు మీకు ఎటువంటి డిస్ప్లే సరిపోతుంది.
HIGHLIGHTS

మీకు ఒక క్లారిటీ కోసం ఈ డిస్ప్లే గురించి పూర్తిగా వివరించి చెబుతున్నాను.

మనం ఒక స్మార్ట్ కొనేప్పుడు అన్ని విషయాలను చూసి కొనుక్కోవాలి. ప్రాసెసర్ , బ్యాటరీ మరియు మరిన్ని విషయాలను గమనించాలి. అయితే, మనం ఒక ఫోనులో ఎప్పుడు చూసే డిస్ప్లే లేదా స్క్రీన్ మాటేమిటి. ఒక మంచి డిస్ప్లే వున్న ఫోన్ ఎంచుకోవడం ముఖ్యం. అందుకోసమే, ఎటువంటి డిస్ప్లే మీకు సరిపోతుంది అనేవిషయం పైన మీకు ఒక క్లారిటీ కోసం ఈ డిస్ప్లే గురించి పూర్తిగా వివరించి చెబుతున్నాను.         

డిస్ప్లే

దీనివలన కలిగే లాభం : అద్భుతమైన దృశ్యాలు మరియు కేవలం ఒక చేతితో ఉపయోగించే సౌలభ్యత.

మీరు మీ స్మార్ట్ ఫోనులో అన్ని కంటెంట్లను దర్శించే ఏకైక ప్రదేశమే ఈ డిస్ప్లే. ఈ డిస్ప్లే పరిమాణం మరియు దాని రకం మీరు మీ స్మార్ట్ ఫోన్లో  మీరు చేసే లేదా చూసే విషయాన్నీ పూర్తి స్వచ్చతతో చూస్తున్నారో లేదో అనే విషయాన్నీ తెలుపుతుంది. మీరు మీ స్మార్ట్ ఫోనులో సరైన డిస్ప్లేను ఎంచుకోవాలని చూస్తుంటే, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొండి.

డిస్ప్లే పరిమాణం

ప్రయోజనం: మీ ఫోన్ను ఒక చేతితో వాడాలా లేదా రెండు చేతులు అవసరమా అనే వాటి మధ్య వ్యత్యాసం.

అసలు విషయం ఏమిటి: డిస్ప్లే యొక్క పరిమాణం మీ స్మార్ట్ ఫోన్ ఎంత పెద్దదిగా ఉండాలో నిర్ణయిస్తుంది. ఫోన్లలో, దీనిని అంగుళాలలో కొలుస్తారు. డిస్ప్లే పెద్దగా ఉంటే,  ఫోన్ కూడా పెద్దగా ఉంటుంది. కానీ మరింత ఆకర్షణీయమైన వీక్షణ అనుభవం ఇస్తుంది. వివిధ రకాల పరిమాణాలలో స్మార్ట్ ఫోన్లు వస్తాయి, వేర్వేరు ఉపయోగ అవసరాలకు తగినట్లుగా, ప్రతిదానికి ఇవి ఆదర్శవంతమైనవి. 

5-అంగుళాలు లేదా తక్కువ

ఐఫోన్ SE వంటి 5-అంగుళాలు లేదా అంతకంటే తక్కువ పరిమాణం గల డిస్ప్లే కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్లు, చిన్న చేతులు ఉన్నవారికి మరియు ఒక చేతితో ఫోన్ను ఉపయోగించాలనుకునే వారికి ఆదర్శంగా ఉంటాయి. 5 అంగుళాలు (అంతకంటే చిన్నదైన) డిస్ప్లే తక్కువ బ్యాటరీ వినియోగాన్ని ఉపయోగించుకుంటుంది, అంటే పెద్ద ఫోన్లతో పోలిస్తే ఇది చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది.  

5.5-6 అంగుళాలు

ఈ 5.5-6 అంగుళాల పరిణామం గల డిస్ప్లే లు ఉన్న స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పనుల కోసం ఎక్కువగా ఉపయోగించదానికి ఆదర్శంగా ఉంటాయి. ఇవి  ఫోటోలను తీయడం లేదా వారి స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ పనిని చేసే వ్యక్తులకి ఇవి విరుద్ధంగా ఉంటాయి. ఈ పరిమాణం గల డిస్ప్లేల మీద వీడియోలను చూసే అనుభవం కూడా మీకు చక్కగా కొనసాగించడానికి సరిపోతుంది. ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఈ డిస్ప్లే పరిమాణం అందుబాటులో వున్నాయి మరియు ప్రస్తుత టెక్నాలజీ కారణంగా, బ్యాటరీలో అధిక వినియోగానికి దారితీయదు.

6.5-అంగుళాలు మరియు అంతకంటే అధికం 

6.5 అంగుళాలు లేదా అంతకంటే పైన కొలత గల డిస్ప్లేతో ఉండే ఫోన్లు,  ప్రాధమికంగా గేమింగ్ లేదా కంటెంట్ వినియోగానికి ఉపయోగపడతాయి. ఈ డిస్ప్లేతో ఉన్న ఫోన్లు పెద్దవిగా ఉంటాయి, అందువల్ల ఇవి చాలా పెద్ద బ్యాటరీని కూడా కలిగి ఉంటాయి. ఈ ఫోన్లు, వాటి పరిమాణం మరియు అధిక బరువు కారణంగా, వాటిని వాడేవారు తమ రెండు చేతులను ఉపయోగించాల్సి ఉంటుంది.

కారక నిష్పత్తి (Aspect Ratio)

ఉపయోగం :  మీరు ఒక చిన్న బాడిలో పెద్ద స్క్రీన్ పొందొచ్చు.

అసలు ఇది ఏమిటి: యాస్పెక్ట్ రేషియో అనేది, డిస్ప్లే యొక్క మొత్తం పొడవు మరియు వెడల్పును నిర్ణయిస్తుంది. ఇది ఒక నిర్దిష్ట స్క్రీన్ పరిమాణాన్నిఇస్తుంది. గతంలో వచ్చిన ఫోన్లు 16:9 యాస్పెక్ట్ రేషియోని అనుసరించాయి, కానీ ఇప్పుడు 18:9 మరియు 19:9 కలిగి ఉన్నాయి, ఇది స్మార్ట్ ఫోన్ యొక్క వెడల్పును తగ్గిస్తుంది, కానీ పొడవును పెంచుతుంది, తద్వారా ఫోన్ను సులభంగా పట్టుకోవచ్చు.

 సంబంధిత చిట్కా: 5.5 అంగుళాలు కలిగిన రెండు ఫోన్లను ఒకటి 16:9 మరియు మరొకటి 18:9 లను రెండు చేతులలో తీసుకొండి. ఈ చిన్న పని వలన ఈ 5.5 అంగుళాల ఫోన్లలో ఒక చేత్తో పట్టుకొనవడానికి ఏది ఇబ్బంది కరంగా ఉంటుందో మీకు అర్ధమవుతుంది.

ప్యానల్ రకం

ప్రయోజనం: యాక్టివ్ కలర్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్ మరియు లీనమయ్యే వీక్షనానుభూతి అన్నికూడా డిస్ప్లే ప్యానల్ రకాన్ని బట్టి ఉంటాయి.   

ఆధునిక స్మార్ట్ ఫోన్ డిస్ప్లే కోసం IPS-LCD లేదా OLED ప్యానల్లను ఉపయోగిస్తున్నారు. IPS-LCD వారి ఫోన్ కచ్చితత్వానికి వారి ఫోన్ల కృతజ్ఞతలు చెప్పొచ్చు, ఇది వారి ఫోన్లలో ఎక్కువగా ఫోటో ఎడిటింగ్ చేసేవారికి గొప్పది. కానీ మీకు బలమైన రంగులు, HDR వీడియో మరియు మెరుగైన బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే, OLED ప్యానెల్తో వచ్చే ఒక స్మార్ట్ ఫోన్ మంచి ఎంపికగా ఉంటుంది. డిస్ప్లే యొక్క ప్రకాశం (Brightness) రేటింగ్ కోసం గమనిస్తే, ఎండఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయంలో సూర్యుని వెలుగులో స్పష్టంగా కనిపించే డిస్ప్లే కోసం కనీసం 150 nits (లేదా 500 lumens) ఉండాలి. IPS ప్యానల్లు మరియు OLED డిస్ప్లే లు రెండు కూడా మంచి వీక్షణ కోణాలు అందిస్తాయి, కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.

అనుకూల చిట్కా: AMOLED, సూపర్ AMOLED మరియు ఆప్టిక్ AMOLED మొదలైనవి వాటి మధ్య చిన్న వ్యత్యాసాలతో OLED సాంకేతికత యొక్క అన్ని వైవిధ్యాలు, ఇంచుమించు సమానమైన ప్రయోజనాలు అందిస్తాయి.  

స్పష్టత  (Resolution)

ప్రయోజనం: అధిక రిజల్యూషన్ (స్పష్టత) = పదునైన చిత్రం.

ఈ స్పష్టత అనేది డిస్ప్లే లో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయో తెలిపే ఒక సంఖ్య. ఇది సాధారణంగా (వెడల్పు x ఎత్తు) పరంగా లెక్కించబడుతుంది. అధిక సంఖ్యలో పిక్సెళ్ళు ఉన్నాయి అనగా, అధిక స్పష్టత లేదా షార్ప్నెస్ అందిస్తుంది. కొన్నిసార్లు, మీరు దీనిని HD – రెడీ (720p), FHD (1080p) లేదా QHD (1440p) గా వంటి వాటితో గమనించవచ్చు. అధిక రిజల్యూషన్, అంటే మరింత ఖరీదైన ఫోన్ అయ్యి ఉంటుంది. స్పష్టతకు ముందు ఒక + చిహ్నం ఉంటే, ఆ ఫోన్ 18:9 కారక నిష్పత్తిని కలిగి ఉంటుందని అర్ధం. ఎక్కువగా కంటెంట్ చూడ్డానికి, ఒక FHD డిస్ప్లే మంచి వివరాలు మరియు బ్యాటరీ జీవితం మధ్య సరైన సమతుల్యాన్ని అందిస్తుంటే మంచిది.

అనుకూల చిట్కా: అధిక రిజల్యూషన్ డిస్ప్లేలు తక్కువ రిజల్యూషన్ డిస్ప్లే కంటే ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తాయి.

HDR vs. Non HDR

ప్రయోజనం : మీరు ఇంతకు మునుపెన్నడూ చూడని రంగులు !

మీ ఫోన్  డిస్ప్లే ద్వారా ఎంత రంగు ప్రదర్శించబడాలి అని నిర్ధారించే దానిని రంగు స్థలం(కలర్ స్పేస్) అని పిలుస్తారు. సామాన్యంగా, అన్ని రకాల సినిమాలు మరియు కంటెంట్లు Non HDR ఫోన్లు కూడా చూడడానికి బాగానే ఉంటాయి.  కానీ మీరు మంచి రిచ్ గా వీక్షణా అనుభవాన్ని కోరుకుంటే మాత్రం HDR అందుబాటులోవుండే ఫోన్లు  మీకు చక్కగా సరిపోతాయి.

అనుకూల చిట్కా: మీరు ఒక మంచి HDR అనుభవాన్ని పొందాలంటే, ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియో వంటి వీడియో కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్ కలిగి ఉండాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo