Vivo Y400 Pro 5G: సెగ్మెంట్ లో అతి సన్నని 3D కర్వుడ్ డిస్ప్లే ఫోన్ గా ఎంట్రీ ఇచ్చింది.!
Vivo Y400 Pro 5G సెగ్మెంట్ లో అతి సన్నని 3D కర్వుడ్ డిస్ప్లే ఫోన్ గా ఎంట్రీ ఇచ్చింది
సూపర్ స్లిమ్ డిజైన్ తో పవర్ ఫుల్ బ్యాటరీ మరియు గొప్ప కెమెరాతో అందించింది
వివో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ఈరోజు నుంచి ప్రారంభించింది
Vivo Y400 Pro 5G: వివో ఈరోజో లాంచ్ చేసిన వివో వై 400 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో అతి సన్నని 3D కర్వుడ్ డిస్ప్లే ఫోన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సూపర్ స్లిమ్ డిజైన్ తో పవర్ ఫుల్ బ్యాటరీ మరియు గొప్ప కెమెరాతో అందించింది. వివో లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ వివో స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
SurveyVivo Y400 Pro 5G: ప్రైస్
వివో వై 400 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 24,999 రూపాయల ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) ని రూ. 26,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు వివో అఫీషియల్ సైట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. వివో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ఈరోజు నుంచి ప్రారంభించింది.
ఆఫర్లు
ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కంపెనీ అందించింది. వివో వై 400 5జి స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.
Also Read: ANC TWS Under Rs.1000: కేవలం రూ. 1000 ధరలో లభించే బెస్ట్ డీల్స్ ఇవే.!
Vivo Y400 Pro 5G: ఫీచర్లు
వివో వై 400 5జి స్మార్ట్ ఫోన్ ను అతి సన్నని 3D కర్వుడ్ డిస్ప్లే ఫోన్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.49mm స్లీక్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 4K HDR వీడియో సపోర్ట్ కలిగిన 6.77 ఇంచ్ 3D కర్వుడ్ స్క్రీన్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది.

ఈ స్మార్ట్ ఫోన్ 50 MP Sony IMX 882 మెయిన్ సెన్సార్ మరియు 2MP బొకే సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ముందు మరియు వెనుక కెమెరా రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.