Vivo Y31t: వివో న్యూ ఫోన్ అదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వివో ఇండియాలో మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది

వివో న్యూ ఫోన్ అదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

డైలీ యూసేజ్ కోసం తగిన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది

Vivo Y31t: వివో ఇండియాలో మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. వివో న్యూ ఫోన్ అదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ చిప్ సెట్, బిగ్ బ్యాటరీ మరియు మంచి పటిష్టమైన డిజైన్ వంటి ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి కూడా వచ్చింది.

Vivo Y31t: ఫీచర్స్

వివో వై31t స్మార్ట్ ఫోన్ ను 6.75 ఇంచ్ HD+ LCD స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 1250 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో బ్రైట్ అండ్ స్మూత్ విజువల్స్ అందిస్తుంది. క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 5జి చిప్ సెట్ Snapdragon 4 Gen 2 తో ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను గరిష్టంగా 6GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ తో అందించింది. ఇది 4nm టెక్నాలజీ చిప్ సెట్ మరియు డైలీ యూసేజ్ కోసం తగిన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ వివో కొత్త ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ జతగా 2MP డెప్త్ కెమెరా ఉంది. అలాగే, ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ HDR ఇమేజ్, AI ఎరేజర్ మరియు మరిన్ని ఏఐ ఫీచర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ రియర్ కెమెరాని మెటాలిక్ మోడ్యూల్ లో అందించింది. ఓవరాల్ గా ఈ ఫోన్ కంప్లీట్ ప్రీమియం లుక్ తో ఆకట్టుకుంటుంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో భారీ 7200 mAh బ్యాటరీ అందించింది. ఈ ఫోన్ కలిగిన బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా వివో ఈ ఫోన్ లో ఆఫర్ చేసింది. ఈ ఫోన్ లో ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

Also Read: Samsung Galaxy S26 FE లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Vivo Y31t: ప్రైస్

వివో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో అందించింది. అలాగే, వై 31 టి ఫోన్ ను సీహోర్ మరియు క్రిమ్సన్ రెడ్ అనే రెండు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ లిస్ట్ క్రింద చూడవచ్చు.

  • వివో వై31t (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ప్రైస్: రూ. 25,999
  • వివో వై31t (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ప్రైస్: రూ. 29,999
  • వివో వై31t (6 జీబీ + 256 జీబీ) వేరియంట్ ప్రైస్: రూ. 34,999

ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, వివో స్టోర్ మరియు రీటైల్ స్టోర్ నుంచి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను HDFC, SBI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, 12 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :