Vivo X Fold 5: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన వివో.!

HIGHLIGHTS

వివో ఎక్స్ ఫోల్డ్ 5 ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ వివో కన్ఫర్మ్ చేసింది

చాలా లైట్ వెయిట్ లో స్ట్రాంగ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో తెలిపింది

వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ మరియు అల్ట్రా లైట్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది

Vivo X Fold 5: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన వివో.!

Vivo X Fold 5: వివో అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 5 ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ వివో కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా లైట్ వెయిట్ లో స్ట్రాంగ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ భారత మార్కెట్ లో ఇదే నెలలో విడుదల అవుతుంది. వివో ఈ ఫోల్డ్ ఫోన్ గురించి ఏమి టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.

Vivo X Fold 5: లాంచ్ డేట్

వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ ను జూలై 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ నుంచి టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ నుంచి సేల్ అవుతుంది.

Vivo X Fold 5: కీలక ఫీచర్స్

వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ మరియు అల్ట్రా లైట్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది, అని ఈ ఫోన్ గురించి వివో గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక మూడు 50MP కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ లో 50MP ZEISS టెలిఫోటో (సోనీ IMX882), 50MP అల్ట్రా సెన్సింగ్ VCS బయోనిక్ మెయిన్ కెమెరా (IMX 921) మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరా (JN1) కెమెరాలు ఉంటాయి. ఇది సూపర్ కెమెరా సెటప్ మరియు ZEISS ఆప్టిక్స్ మరియు జీఎస్ కెమెరా ఫిల్టర్స్ కూడా కలిగి ఉంటుంది.

Vivo X Fold 5 India launch

వివో ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఈ పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W డ్యూయల్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ AI స్మార్ట్ ఆఫీస్ ఫీచర్ తో గొప్ప ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కలిగిన ఫ్యూచర్ ప్రూఫ్ ఫోల్డ్ ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లు కూడా త్వరలోనే వివో అందిస్తుందని తెలిపింది.

అయితే, ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ మరియు రూమర్లు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. ఈ రూమర్స్ మరియు అంచనా ఫీచర్స్ ప్రకారం, ఈ ఫోన్ మడతపెట్టే వీలుండే 8.3 ఇంచ్ LPTO AMOLED స్క్రీన్ తో వచ్చే అవకాశం వుంది. ఈ స్క్రీన్ 2K రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్,120Hz మరియు TUV ఐ ప్రొటెక్ట్ 3.0 సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 6.53 ఇంచ్ పరిమాణం కలిగిన వెలుపలి స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్ బెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv డీల్ పై ఒక లుక్కేద్దామా.!

ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కాబట్టి ఈ ఫోన్ ను క్వాల్కమ్ ప్రీమియం అండ్ పవర్ ఫుల్ చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ తో లాంచ్ చేసే వాక్సం ఉందని మరి కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ ఫీచర్స్ గురించి వివో అఫీషియల్ గా వెల్లడించిన తర్వాత ఈ ఫోన్ ఫీచర్స్ పై ఒక అవగాహన వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo