Vivo V70 FE : భారీ 200MP కెమెరాతో కొత్త ఫోన్ అనౌన్స్ చేసిన వివో.!

HIGHLIGHTS

Vivo V70 FE స్మార్ట్ ఫోన్ టీజర్ ఈ రోజు విడుదల చేసింది

వివో వి70 సిరీస్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తోంది

ఈ ఫోన్ 200MP భారీ కెమెరా తో లాంచ్ అవుతుందని ప్రకటించి హైప్ పెంచేసింది

Vivo V70 FE : భారీ 200MP కెమెరాతో కొత్త ఫోన్ అనౌన్స్ చేసిన వివో.!

Vivo V70 FE: ఇండియన్ మార్కెట్లో వివో త్వరలో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఈ రోజు విడుదల చేసింది. వివో వి70 సిరీస్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తోంది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ 200MP భారీ కెమెరా తో లాంచ్ అవుతుందని ప్రకటించి, ఈ ఫోన్ పై హైప్ పెంచేసింది. మరి ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ లాంచ్ వివరాలు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V70 FE : లాంచ్ డేట్

వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ని మాత్రమే ఈ రోజు విడుదల చేసింది. వివో వి70 FE స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ని ఇంకా కంపెనీ ప్రకటించలేదు. అయితే, వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఈ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నారు.

Vivo V70 FE 5G launch

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం వివో అఫీషియల్ X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్ నుంచి టీజర్ వీడియో విడుదల చేసింది. ఈ ఫోన్ టీజర్ వీడియో నుంచి ఈ ఫోన్ డిజైన్ మరియు మరిన్ని కీలక వివరాలు కూడా రివీల్ చేసింది.

Also Read: Tecno Spark 50 5G: బిగ్ బ్యాటరీ అండ్ న్యూ డిజైన్ తో టెక్నో కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది.!

Vivo V70 FE : కీలక ఫీచర్స్

ఈ ఫోన్ టీజర్ లో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ తెలిపే షాట్ అందించింది. ఇందులో ఈ ఫోన్ గ్రేడియంట్ బ్యాక్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో పవర్ ఫుల్ 200MP మెయిన్ కెమెరా ఉన్నట్లు కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ తో వస్తుంది. అంటే. ఈ ఫోన్ స్టేబుల్ వీడియోలు మరియు అన్ బ్లర్ ఫోటోలు ఆఫర్ చేస్తుంది.

ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే ని సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా భారీ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఇతర కీలక ఫీచర్లు త్వరలో అనౌన్స్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo