Tecno Spark 50 5G: బిగ్ బ్యాటరీ అండ్ న్యూ డిజైన్ తో టెక్నో కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

టెక్నో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కొత్తగా టీజర్ ని విడుదల చేసింది

Tecno Spark 50 5G స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లు కూడా రివీల్ చేసింది

Tecno Spark 50 5G: బిగ్ బ్యాటరీ అండ్ న్యూ డిజైన్ తో టెక్నో కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది.!

Tecno Spark 50 5G: టెక్నో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కొత్తగా టీజర్ ని విడుదల చేసింది. అదే, టెక్నో స్పార్క్ 50 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లు కూడా రివీల్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Spark 50 5G: లాంచ్ డేట్

టెక్నో స్పార్క్ 50 5జి స్మార్ట్ ఫోన్ ను మార్చి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు టెక్నో డేట్ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు రివీల్ చేసింది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుందని క్లియర్ చేసింది.

Tecno Spark 50 5G: కీలక ఫీచర్స్

టెక్నో స్పార్క్ 50 స్మార్ట్ ఫోన్ ఏరో స్పేస్ గ్రేడ్ 6 సిరీస్ అల్యూమినియం కెమెరా డెకో ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ సరికొత్త కెమెరా బంప్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో ఈ ఫోన్ పై భాగంలో పెద్ద బంప్ లో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ మంచి డిజైన్ లో ఉంటుంది. ఈ ఫోన్ 1.5 మీటర్ డ్రాప్ టెస్ట్ తట్టుకున్న MIL-STD మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో వస్తుంది.

Tecno Spark 50 5G

ఈ ఫోన్ మంచి నెట్ వర్క్ అందించే 4 x 4 MIMO సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో అందించిన సిస్టం తో ఈ ఫోన్ వీక్ నెట్ వర్క్ లో కూడా 2x వేగవంతమైన UPI పేమెంట్ కోసం సపోర్ట్ చేస్తుందని టెక్నో తెలిపింది. ఈ ఫోన్ లో కూడా ఎమర్జెన్సీ ఆఫ్ లైన్ కాలింగ్ సపోర్ట్ అందిస్తున్నట్లు కూడా టెక్నో తెలిపింది. ఈ ఫోన్ ఫాంటసీ పర్పల్, మింట్ గ్రీన్, ఇన్క్ బ్లాక్ మరియు కెంపగనే గోల్డ్ నాలుగు రంగుల్లో లాంచ్ అవుతుంది.

Also Read: BSNL Super Offer: మరో వారంలో క్లోజ్ అవబోతున్న ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫర్ మిస్ అవ్వకండి.!

టెక్నో స్పార్క్ 50 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ గురించి చాలా గొప్పగా టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6500 mAh భారీ బ్యాటరీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ వేగవంతమైన బ్యాటరీని మరింత వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా భారతీయ లోకల్ లాంగ్వేజ్ లకు సపోర్ట్ చేసే Ella AI సపోర్ట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్లు కంపెనీ త్వరలో ప్రకటిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo