vivo T4R: ఫస్ట్ లుక్ మరియు లాంచ్ డేట్ రివీల్ చేసిన వివో.!

HIGHLIGHTS

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో టి4ఆర్ లాంచ్ కోసం ‘కమింగ్ సూన్’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేప్పట్టిన వివో

ఈరోజు ఈ ఫోన్ ఫస్ట్ లుక్ మరియు లాంచ్ డేట్ రివీల్ చేసింది

ఈ ఫోన్ కొత్త కలర్స్ తో కొత్త లుక్ తో ఉన్నట్లు గమనించవచ్చు

vivo T4R: ఫస్ట్ లుక్ మరియు లాంచ్ డేట్ రివీల్ చేసిన వివో.!

vivo T4R :వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో టి4ఆర్ లాంచ్ కోసం ‘కమింగ్ సూన్’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేప్పట్టిన వివో, ఈరోజు ఈ ఫోన్ ఫస్ట్ లుక్ మరియు లాంచ్ డేట్ రివీల్ చేసింది. ఈ ఫోన్ ను వివో బడ్జెట్ సిరీస్ గా పేరొందిన T సిరీస్ నుంచి అందిస్తుంది మరియు ఈ ఫోన్ కూడా అదే ‘గెట్ సెట్ టర్బో’ నినాదంతో వస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

vivo T4R: ఎప్పుడు లాంచ్ అవుతుంది?

వివో టి4 ఆర్ స్మార్ట్ ఫోన్ ను జులై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంటే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ కూడా అందించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ ఫస్ట్ లుక్ కూడా వివో విడుదల చేసింది.

vivo T4R Launch

vivo T4R: ఫస్ట్ లుక్

వివో టి4ఆర్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్ చూస్తుంటే, ఈ ఫోన్ ముందుగా వచ్చిన స్మార్ట్ ఫోన్స్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, ఈ ఫోన్ కొత్త కలర్స్ తో కొత్త లుక్ తో ఉన్నట్లు గమనించవచ్చు. వివో టి4ఆర్ స్మార్ట్ ఫోన్ వెనుక దూల రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో కూడా ఆరా లైట్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ సెంటర్ పంచ్ హోల్ సెటప్ కలిగిన క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే తో ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక కర్వుడ్ గ్లాస్ తో గ్లాసీ బ్యాక్ డిజైన్ తో వస్తుంది.

Also Read: iQOO Z10R: స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

vivo T4R: అంచనా ఫీచర్లు

ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్లు ఆన్లైన్ లో దర్శనమిచ్చాయి. ఆన్లైన్ లో ఈ ఫోన్ గురించి చక్కర్లు కొడుతున్న రూమర్లు మరియు అంచనా ఫీచర్స్ పరిగణలోకి తీసుకుంటే, వివో టి4ఆర్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా, ఈ ఫోన్ 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో పెద్ద బ్యాటరీ కలిగి ఉండే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ కూడా ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న IP 69 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ ఫోన్ కీలక ఫీచర్లు మరియు స్పెక్స్ కూడా వివో ముందే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందు వస్తాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo