Vivo T4R 5G: అతి సన్నని డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న వివో.!

HIGHLIGHTS

వివో కొత్త ఫోన్ Vivo T4R 5G లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది

ఈ ఫోన్ ను అతి సన్నని డిజైన్ తో అందిస్తున్నట్లు వివో తెలిపింది

డ్జెట్ సిరీస్ అయిన టి సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది

Vivo T4R 5G: అతి సన్నని డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న వివో.!

Vivo T4R 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. అదే వివో టి4 ఆర్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను అతి సన్నని డిజైన్ తో అందిస్తున్నట్లు వివో తెలిపింది. రీసెంట్ గా వివో ఎక్స్ 200 FE మరియు వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన వివో ఇప్పుడు బడ్జెట్ సిరీస్ అయిన టి సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T4R 5G: లాంచ్

వివో టి4 ఆర్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు ‘Coming Soon’ ట్యాగ్ తో టీజింగ్ చేస్తోంది. ఈ అప్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ను సేల్ పార్టనర్ గా ఎంచుకుంది మరియు ఫ్లిప్ కార్ట్ నుండి ప్రత్యేకమైన టీజర్ పేజీతో టీజింగ్ కూడా చేస్తోంది.

Vivo T4R 5G : ఫీచర్లు

ఈ వివో ఫోన్ యొక్క రెండు కీలక ఫీచర్స్ ను టీజర్ పేజీ ద్వారా అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను ఇండియాలో సన్నని ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు వివో టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ ఇండియాలో ఇప్పటివరకు విడుదల చేసిన క్వాడ్ కర్వుడ్ ఫోన్స్ కంటే మరింత సన్నని డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో టీజింగ్ చెబుతోంది.

Vivo T4R 5G

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే గురించి కూడా వివో కన్ఫర్మ్ చేసింది. వివో టి4 ఆర్ స్మార్ట్ ఫోన్ ను క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ డిజైన్ ను వెల్లడించే టీజర్ ఇమేజ్ కూడా వివో విడుదల చేసింది. ఈ టీజర్ ఇమేజ్ వివో చెప్పినట్టు ఈ ఫోన్ ను చాలా సన్నని డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో పెద్ద రౌండ్ కెమెరా బంప్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది.

Also Read: Lava Blaze Dragon: కొత్త ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన లావా.!

వివో టి4 ఆర్ : అంచనా ఫీచర్లు

వివో టి4 ఆర్ అంచనా ఫీచర్స్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ రూమర్స్ ప్రకారం, ఈ వివో ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ 50 MP Sony IMX882 మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుందని ఈ రూమర్స్ చెబుతున్నాయి.

ఈ ఫోన్ టీజింగ్ ద్వారా కంపెనీ త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ కూడా వెల్లడిస్తుంది కాబట్టి, ఈ రూమర్స్ లో ఎన్ని నిజమౌతాయి అని చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo