Lava Blaze Dragon: ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈరోజు అనౌన్స్ చేసింది. బ్లేజ్ డ్రాగన్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కు ఈ పేరెందుకు పెట్టామో చెప్పండి అంటూ టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు కంపెనీ అఫీషియల్ X అకౌంట్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ టీజర్ వీడియో కూడా విడుదల చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
Lava Blaze Dragon: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
లావా డ్రాగన్ స్మార్ట్ ఫోన్ ను జూలై 25వ తేదీ మధ్యాహ్నం లాంచ్ చేస్తున్నట్లు లావా లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను లావా బ్లేజ్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి టీజ్ అవుతోంది మరియు ప్రత్యేకమైన టీజర్ పేజి కూడా అందుకుంది. కంపెనీ ఈ ఫోన్ ను ‘రైజ్ ఆఫ్ ది ఇండియన్ డ్రాగన్’ హ్యాష్ ట్యాగ్ తో టీజ్ చేస్తోంది.
లావా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ వీడియో విడుదల చేసింది. ఈ టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ యొక్క కొన్ని స్పెక్స్ బయటకు వెల్లడవుతున్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రౌండ్ కార్నర్ కలిగిన సన్నని డిజైన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో, డ్రాగన్ చిప్ సెట్ ఉన్నట్లు టీజ్ చేస్తోంది. ఈ హింట్ చూస్తుంటే ఈ అప్ కమింగ్ ఫోన్ ను లేటెస్ట్ Snapdragon చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు.
అయితే, లావా ఈ ఫోన్ కు డ్రాగన్ అనే పేరు ఎందుకు పెట్టామో కనిపెట్టండి? అంటూ టీజింగ్ చేస్తుండటంతో ఇది మరింకేదైనా కొత్త చిప్ సెట్ అవుతుందా? అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఈ విషయం పక్కన పెడితే, ఈ అప్ కమింగ్ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అంతేకాదు, ఇందులో, ఫోన్ అడుగున టైప్ C పోర్ట్, స్పీకర్ గ్రిల్ మరియు 3.5mm జాక్ పోర్ట్ ఉన్నట్లు చూపించింది.
ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చే వారం లాంచ్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా లావా టీజింగ్ ద్వారా అందించే అవకాశం ఉంటుంది.