Vivo T4 5G: రేపు విడుదల కానున్న ఈ ఫోన్ పూర్తి ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
Vivo T4 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ ఈరోజే తెలుసుకోనున్నాము
ఈ ఫోన్ ను దేశంలో అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా లాంచ్ చేస్తోంది
Vivo T4 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ ఈరోజే తెలుసుకోనున్నాము. ఈ లాంచ్ కోసం కంపెనీ చేప్పట్టిన టీజర్ క్యాంపైన్ నుంచి ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలు రివీల్ చేసింది. ఈ ఫోన్ ను దేశంలో అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా లాంచ్ చేస్తోంది. అంతేకాదు, డిస్ప్లే మొదలుకొని కెమెరా కెమెరా వరకు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుందని వివో గొప్పగా చెబుతోంది.
SurveyVivo T4 5G : ఫీచర్స్
వివో టి4 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కేవలం 7.98mm మందంతో చాలా సన్నగా మరియు 199 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందట. ఈ ఫోన్ ను స్ట్రీమ్ లైన్ డిజైన్ తో అందించింది. టి14 స్మార్ట్ ఫోన్ లో కఠినమైన స్కాట్ షీల్డ్ గ్లాస్ రక్షణ కలిగిన AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, AI Eye ప్రొటెక్షన్ మరియు 5000 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.
ఈ వివో కొత్త ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7s Gen చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఇది 4nm TSMC చిప్ సెట్ మరియు ఇది 820K కి పైగా AnTuTu స్కోర్ అందించడమే కాకుండా 30% అధిక AI పెర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. అంతేకాదు, దీనికి తగిన ర్యామ్ మరియు అధిక స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

వివో టి4 5జి స్మార్ట్ ఫోన్ అతిపెద్ద 7300 mAh సిలికాన్ కార్బన్ యానోడ్ టెక్నాలజీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను పవర్ బ్యాంక్ లాగా ఉపయోగించే విధంగా రివర్స్ ఛార్జ్ మరియు ఫోన్ వేడెక్కకుండా చూసేలా బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ ఫోన్ కెమెరా పరంగా, వెనుక 50MP (Sony IMX882) మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో రింగ్ ఫ్లాష్ లైట్ ను కూడా అందించింది. గేమింగ్ సమయంలో కూడా ఈ ఫోన్ వేడెక్కకుండా చల్ల బరిచే పెద్ద పోలీ గ్రాఫైట్ షీట్ ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
Also Read: CMF Phone 2 Pro: ప్రత్యేకమైన కెమెరా బటన్ మరియు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!
వివో టి4 5జి స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా మంచి లాంచ్ ఆఫర్స్ కూడా అందించే అవకాశం ఉండవచ్చు.