CMF Phone 2 Pro: ప్రత్యేకమైన కెమెరా బటన్ మరియు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!

HIGHLIGHTS

CMF Phone 2 Pro స్మార్ట్ ఫోన్ టీజింగ్ వేగం మరింత వేగం చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకమైన కెమెరా బటన్ ఉంటుంది

ట్రిపుల్ రియర్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది

CMF Phone 2 Pro: ప్రత్యేకమైన కెమెరా బటన్ మరియు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!

CMF Phone 2 Pro: నథింగ్ సబ్ బ్రాండ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ వేగం మరింత వేగం చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన కెమెరా బటన్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ కొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుందని సిఎంఎఫ్ గొప్పగా చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

CMF Phone 2 Pro: ఫీచర్స్

సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 28 వ తేదీ సాయంత్రం 6గంటల 30 నిముషాలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన వివరాలు కూడా సిఎంఎఫ్ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజి ద్వారా ఈ ఫోన్ కీలకమైన వివరాలతో టీజింగ్ చేస్తోంది.

CMF Phone 2 Pro

సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన కెమెరా బటన్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు సిఎంఎఫ్ తెలిపింది. ఈ ఫోన్ రియర్ కెమెరా సెటప్ లో 50MP మెయిన్, 50MP టెలిఫోటో మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ ఇదే అవుతుందని కూడా సిఎంఎఫ్ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.

సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో లో అన్ని వివరాలు ఒకే వద్ద అందించే కొత్త AI ఆధారిత Space ఫీచర్ ఉంటుందని కూడా సిఎంఎఫ్ తెలిపింది. సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ 5జి చిప్ సెట్ Dimensity 7300 Pro తో లాంచ్ అవుతుంది. డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ సరికొత్త డ్యూయల్ ఎలివేటెడ్ ఫినిష్ డిజైన్ తో వస్తుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 7 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ Smart TV డీల్స్.!

ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఈ ఫోన్ గురించి కంపెనీ అఫీషియల్ గా తెలిపిన కీలకమైన వివరాలు. అయితే, ఈ ఫోన్ పై వచ్చిన రూమర్స్ మరియు లీక్స్ ద్వారా ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు గొప్ప డిస్ప్లే కలిగి ఉంటుందని అంచనా. త్వరలోనే ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా కంపెనీ బయటకి వెల్లడించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo