రూ. 3,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మొదలైన vivo T3 Pro 5G ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు మొదలయ్యింది

ఈ ఫోన్ మొదటి సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది

ఈరోజు అందించిన ఆఫర్ తో ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకు అందుకోవచ్చు

రూ. 3,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మొదలైన vivo T3 Pro 5G ఫస్ట్ సేల్.!

వివో గత వారం భారత మార్కెట్లో విడుదల చేసిన vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు మొదలయ్యింది. ఈ ఫోన్ మొదటి సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ ను గరిష్టంగా రూ. 3,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈరోజు సేల్ నుంచి వివో ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ ఫోన్ ను ఈరోజు అందించిన ఆఫర్ తో మరింత తక్కువ ధరకు అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

vivo T3 Pro 5G : ప్రైస్

వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB +128GB) ను రూ. 24,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అందించింది. ఈ ఫోన్ యొక్క (8GB + 256GB) ను రూ. 26,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి Flipkart మరియు vivov.com నుంచి సేల్ అవుతోంది.

ఆఫర్స్

ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ ఆఫర్స్ ను వివో అందించింది. ఈ ఫోన్ ను Axis, Flipkart Axis, HDFC మరియు SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను రూ. 21,999 రూపాయల ప్రారంభ ధరతో అందుకునే అవకాశం వుంది.

Also Read: WhatsApp New Feature: కొత్త అప్డేట్ తో కొత్త ఫీచర్ విడుదల చేసిన వాట్సాప్..!

vivo T3 Pro 5G : ఫీచర్స్

వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగిన ఫోన్ గా వచ్చింది. ఈ ఫోన్ 4500 నిట్స్ లోకల్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ వేగంగా పని చేసే Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8GB ర్యామ్ తో పాటు 256GB స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.

vivo t3 pro 5g
vivo T3 Pro 5g

ఈ వివో కొత్త ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన Sony IMX 882 ప్రధాన కెమెరా మరియు 8MP కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 4K వీడియోలు మరియు AI సపోర్టెడ్ ఫోటోలు షూట్ చేయవచ్చు మరియు ఎడిట్ చేసే వీలుంది. ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo