32MP పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన Vivo S1 Pro

32MP పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన Vivo S1 Pro
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 32MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో విడుదల చేయబడింది.

వివో S1 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసరుకి జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో f/1.7 అపర్చర్ గల ఒక ప్రధాన 48MP కెమెరాకి జతగా, 8MP(f/2.2) మరియు 5MP(f2.4) కెమేరాలను కలిపి ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుగా అందించారు.

చైనా మొబైల్ తయారీదారుడైన Vovo సంస్థ, చైనాలో వివో S1 ప్రో వేరియంట్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 32MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో విడుదల చేయబడింది. అంతేకాదు, వివో S1 ప్రో ఫోన్ను ఒక స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను ప్రస్తుతం మార్కెట్లో ట్రెండీగా నడుస్తున్న ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు స్టైలిష్ సెల్ఫీ కెమేరాలను ప్రధానాంశంగా చేసుకొని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Vivo S1 Pro  ప్రత్యేకతలు

ఈ Vivo S1 Pro స్మార్ట్ ఫోన్, 1080X2340 పిక్సెల్ రిజల్యూషన్ అందించగల ఒక 6.39 అంగుళాల FHD+ డిస్ప్లే తో ఉంటుంది. ఈ ఫోన్ ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో, ఎక్కుగా స్క్రీన్ పరిమాణంలో వస్తుంది. వివో S1 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసరుకి జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. అలాగే, ఈ ఫోనులో అంతర్గతంగా 128GB స్టోరేజిని అందించారు మరియు ఒక మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకూ మెమొరీ సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఒక 3,700mAh బ్యాటరీతో ఒక రోజంతా పనిచేస్తుంది, అని సంస్థ చెబుతోంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో f/1.7 అపర్చర్ గల ఒక ప్రధాన 48MP కెమెరాకి జతగా, 8MP(f/2.2) మరియు 5MP(f2.4) కెమేరాలను కలిపి ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుగా అందించారు. ఒక సెల్ఫీ విభాగానికి వస్తే, ఇందులో f/2.0 అపర్చరు గల ఒక 32MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాని అందించారు. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా FunTouch OS 9 పైన నడుస్తుంది. ధర విషయానికి వస్తే, ఇది CNY 2,698 (మనకు ఇంచుమించు రూ.27,684 కు సమానం )  ప్రారంభదరతో ఉంటుంది.                            

                                  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo