Vivo Fold 3 Pro: బిగ్ అండ్ బ్రైట్ డిస్ప్లే మరియు సన్నని డిజైన్ తో వస్తోంది.!

Vivo Fold 3 Pro: బిగ్ అండ్ బ్రైట్ డిస్ప్లే మరియు సన్నని డిజైన్ తో వస్తోంది.!
HIGHLIGHTS

Vivo Fold 3 Pro ఫోల్డ్ ఫోన్ ను ఇండియాలో ప్రవేశపెడుతోంది

వివో ఫోల్డ్ 3 ప్రో ఫోల్డ్ ఫోన్ సన్నని డిజైన్ తో వస్తుంది

ఈ ఫోన్ లో 100W డ్యూయల్ సెల్ల్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ వుంది

Vivo Fold 3 Pro: ఇండియాలో ఇప్పటివరకు ఫోల్డ్ ఫోన్ లను ప్రవేశపెట్టని వివో, ఇప్పుడు వివో ఫోల్డ్ 3 ప్రో ఫోల్డ్ ఫోన్ ను ఇండియాలో ప్రవేశపెడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు కానీ, ఈ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. కంపెనీ టీజర్ ద్వారా ఈ ఫోన్ బిగ్ అండ్ బ్రైట్ డిస్ప్లే మరియు సన్నని డిజైన్ తో వస్తున్నట్లు అర్ధం అవుతోంది.

Vivo Fold 3 Pro

వివో ఫోల్డ్ 3 ప్రో గురించి కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది. వివో ఇండియా అధికారిక X అకౌంట్ నుండి ఈ ఫోన్ గురించి రెగ్యులర్ గా టీజర్ లను విడుదల చేస్తోంది. ఇప్పటి వరకూ అందించిన టీజర్ వీడియోల ద్వారా ఈ ఫోన్ గొప్ప బ్రైట్నెస్ అందించగల డిస్ప్లే మరియు సన్నని డిజైన్ ఉన్నట్లు తెలిపింది.

Vivo Fold 3 Pro  Coming Soon
Vivo Fold 3 Pro Coming Soon

అంతేకాదు, ఈ ఫోన్ చాలా తేలికగా ఉంటుందని కూడా వెల్లడించింది. ఈ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ ఆకర్షణీయంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద రౌండ్ బంప్ లో ఉన్న కెమెరా సెటప్ కనిపిస్తోంది. ఈ ఫోన్ AI ఫీచర్స్ లను కలిగి ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

ఈ అప్ కమింగ్ ఫోల్డ్ ఫోన్ ను Zeiss ఆప్టిక్స్ తో తీసుకు వస్తోంది. వివో వెబ్సైట్ నుండి ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలను కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్ ను రోజు 100 ఫోల్డ్ లు చొప్పున 12 సంవత్సరాలు ఫోల్డ్ చేసిన కూడా ఎటువంటి హాని జరగని విధంగా కార్బన్ ఫైబర్ అల్ట్రా డ్యూరబుల్ హింజ్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది.

Also Read: OnePlus 11R 5G పైన 12 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించిన Amazon

వివో ఫోల్డ్ 3 ప్రో ఫోల్డ్ ఫోన్ ను ఫోల్డ్ చేసినప్పుడు కేవలం 11.2mm మందం మాత్రమే ఉంటుందని వివో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ 236 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుందని కూడా ప్రకటించింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా గొప్ప డిస్ప్లే తో ఈ ఫోన్ వస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ ఫోన్ లో Zeiss Telephoto Camera మరియు Zeiss మల్టి ఫంక్షనల్ పోర్ట్రైట్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కెమెరా 24mm నుండి 100mm వరకు మల్టిఫుల్ ఫంక్షనల్ ఫోకాల్ లెంగ్త్ లను కలిగి ఉన్నట్లు తెలిపింది.

Processor

Vivo Fold 3 Pro  Features
Vivo Fold 3 Pro Features

ఈ అప్ కమింగ్ ఫోల్డ్ ఫోన్ ను Snapdragon 8 Gen ఫాస్ట్ ప్రోసెసర్ తో అందిస్తున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 100W డ్యూయల్ సెల్ల్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5700 mAh బ్యాటరీ ఉన్నట్లు కూడా తెలిపింది.

ఇవన్నీ చూస్తుంటే, వివో అప్ కమింగ్ ఫోల్డ్ ఫోన్ వివో ఫోల్డ్ 3 ప్రో భారీ ఫీచర్స్ తో భారత్ లో అడుగు పెడుతున్నట్లు కన్పిస్తోంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo