RealMe X స్మార్ట్ ఫోన్ ఒక 48MP సోనీ IMX586 సెన్సారుతో రానుంది.

RealMe X స్మార్ట్ ఫోన్ ఒక 48MP సోనీ IMX586 సెన్సారుతో రానుంది.
HIGHLIGHTS

ఈ ఫోన్ ఒక 48MP సోనీ IMX586 సెన్సార్ను కలిగి ఉందని కూడా నిర్ధారించింది.

రియల్మీ త్వరలో తీసుకురానున్న  రియల్మీ X లో  బెజెల్ లెస్ డిస్ప్లేతో ఉండవచ్చని తెలిపిన ఒక రోజు తర్వాత, ఈ ఫోన్ ఒక 48MP సోనీ IMX586 సెన్సార్ను కలిగి ఉందని కూడా నిర్ధారించింది. ఇప్పుడు రియల్మీ దీని గురించిన మరొక టీజర్-పోస్టర్ను పోస్ట్ చేసింది, ఇందులో "4800W," మరియు "సోనీ IMX586." అని పేర్కొన్నది. ఈ సెన్సారుతో వచ్చిన లెన్స్ గురించి సమాచారం కూడా ఈ సంస్థ వెల్లడించింది. ఇది లెన్స్ లో  F / 1.7 యొక్క అపర్చరు కలిగి ఉంటుంది, ఇది మే 14 న ప్రారంభించనున్న OnePlus 7 లో కూడా రావచ్చు.

దాని చైనీయ ప్రత్యర్ధుల వలెనే, రియల్మీ కూడా  ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లు గురించి ముందు నుండే  టీజింగ్ చేస్తోంది. ఈ వారంలో, ఈ కంపెనీ ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి సమాచారం బయటకుతెలియచేసే రెండు టీజర్లను విడుదల చేసింది. మొట్టమొదటి టీజర్లో, కంపెనీ Weibo లో ఒక పోస్టర్ను పోస్ట్ చేసింది, అందులో ఒక  రియల్మీ  X లో అధిక స్క్రీన్ – టూ – బాడీ నిష్పత్తి కలిగిన ఒక AMOLED డిస్ప్లేను గురించి నిర్ధారిస్తుంది. రెండవ టీజర్లో, సంస్థ CMO Ju Qi Chase  ఈ స్మార్ట్ఫోన్ యొక్క లైవ్ ఇమేజిలో నోచ్ లెస్ డిస్ప్లే  మరియు ఫోన్ రూపకల్పనను చూపించే ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు.

Weibo Realme poster camera.jpg

మొట్టమొదటి పోస్టర్ ఫ్యూచరిస్టిక్ రూపకల్పనలు ప్రదర్శిస్తుంది, దీనిలో "AMOLED" టెక్స్ట్ ఉన్న బిల్ బోర్డు కనిపిస్తుంది. ఈ పోస్టర్ కూడా స్మార్ట్ఫోన్ ఒక 91.2 శాతం స్క్రీన్ టూ బాడీ  నిష్పత్తి కలిగిఉన్నట్లు వెల్లడించారు. ఒక నోచ్ లెస్ డిస్ప్లేతో, ఈ ఫోన్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా కలిగి ఉందని, దీని ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, మరియు సంస్థ దాని జీవితకాలంలో 200,000 సార్లు ఇది పని చేయగలదని పేర్కొంది.

రియల్మీ X స్మార్ట్ ఫోన్ ఒక  స్నాప్డ్రాగెన్ 855 ప్లాట్ఫారం పైన చేయబడుతుందని, పలు RAM ఎంపికలుతో పాటు 6GB RAM + 64GB స్టోరేజి, 6GB RAM + 128GB స్టోరేజి  మరియు 8GB RAM + 128GB స్టోరేజి ఎంపికలను కలిగి ఉంటుందిని ఊహిస్తున్నారు. ఇది పూర్తి HD + స్పష్టతతో 6.5-అంగుళాల OLED డిస్ప్లేతో లభిస్తుంది, మరియు ఈ డిస్ప్లే  గొరిల్లా గ్లాస్ 5 ద్వారా సంరక్షించబడుతుంది. ఆరవ-తరం ఆప్టికల్-డిస్ప్లే వేలిముద్ర సెన్సారును  ఈ ఫోనుకు అమర్చవచ్చని  కూడా కొన్ని రూమర్లు సూచిస్తున్నాయి. ముందు ఒక 16MP సెల్ఫీ కెమెరాతో పాటుగా 48MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఈ స్మార్ట్  ఫోన్ రావచ్చని ముందస్తు అంచనా రిపోర్ట్స్ తెలియచేస్తున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo