poco F1 పైన రూ. 5000 వరకు డిస్కౌంట్ ప్రకటించిన షావోమి: డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 8 వరకు

poco F1 పైన రూ. 5000 వరకు డిస్కౌంట్ ప్రకటించిన షావోమి: డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 8 వరకు
HIGHLIGHTS

ఒక ట్వీట్లో, Poco F1 స్మార్ట్ ఫోన్ యొక్క నాలుగు వేరియంట్ల పైన, కంపెనీ డిస్కౌంట్ను అందిస్తోందని Poco ఇండియా ప్రకటించింది

Xiaomi Poco F1, ఈ సంవత్సరం ఆగస్టులో ప్రధాన స్థాయి హార్డువేరుతో అత్యంత సరసమైన స్మార్ట్ ఫోనుగా విడుదలై అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. ఈ  
స్మార్ట్ఫోన్ ఫోన్ 20,999 రూపాయల ధరతో  ఈ సెగ్మెంట్ లో OnePlus 6 వంటి వాటికీ పోటీని ఇచ్చింది. రూపాయి యొక్క విలువ తగ్గిన కారణంగా Xiaomi దాని ఉత్పత్తుల ధరలను పెంచినప్పటికీ, డిసెంబర్ 6-8 మధ్య ఫ్లిప్ కార్ట్ మరియు Mi.com లలో Poco F1 స్మార్ట్ ఫోన్ల పైన అత్యధికంగా 5,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

ఒక ట్వీట్లో, Poco F1 స్మార్ట్ ఫోన్ యొక్క నాలుగు వేరియంట్ల పైన, డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 8 వరకు డిస్కౌంట్ను అందిస్తోందని Poco ఇండియా ప్రకటించింది. ధర రూ. 21,999 కలిగిన, 6GB RAM + 64GB స్టోరేజి వేరియంట్ పైన ఇప్పుడు 2000 రూపాయల డిస్కౌంట్ మరియు  రూ .24,999 కి అందుబాటులో ఉన్న 6GB RAM + 128GB నిల్వ వేరియంట్ పైన 3,000 రూపాయలు డిస్కౌంట్ అందుకోవచ్చు మరియు కొనుగోలుదారులు 21,999 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 8GB RAM + 256GB నిల్వ వెర్షన్ ప్రస్తుతం 30,999 రూపాయల ధరకు లభిస్తుంది. అయితే, దీనిపైన  రూ. 5,000 తగ్గింపుతో  ధర రూ .25,999 వద్ద కొనుగోలుచేయవచ్చు. అలాగే, 30,999 రూపాయల ధర కలిగిన 8GB RAM + 256GB స్టోరేజి కలిగిన ప్రత్యేక ఆర్మర్డ్ ఎడిషన్ పైన రూ .4,000 డిస్కౌంట్నుఅందుకోవచ్చు, కొనుగోలుదారుల దీనిని రూ .26,999 ధర వద్ద కోనుగోలు చేయవచ్చు.

Xiaomi Poco F1.jpg

Poco F1 ఫీచర్స్ మరియు లక్షణాలు
Poco F1 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ఆక్టా-కోర్ ప్రాసెసర్ చేత శక్తినిస్తుంది మరియు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది, ఇది ఫోన్ లోపలముఖ్యంగా వినియోగ సమయంలో CPU ను చల్లబరచడానికి సహాయపడే ఒక రాగి గొట్టం కలిగివుంటుంది . ఈ స్మార్ట్ ఫోన్ 19: 9 యొక్క రిజల్యూషన్ తో ఒక 6.18-అంగుళాల ఫుల్  HD + IPS LCD డిస్ప్లేతో 'నోచ్' కలిగిఉంది. డిస్ప్లేలో వున్నా నోచ్,  లైటింగ్ సెన్సార్, ఇయర్ పీస్, ఒక 20MP కెమెరా మరియు లోపల ఒక సన్నిహిత సెన్సార్ కలిగివుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక 4000mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు స్పీడ్ ఛార్జ్ 3.0 సాంకేతికతతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, Poco F1 వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ప్రాధమిక కెమెరాలో f / 1.8 ఎపర్చర్, డ్యూయల్ పిక్సెల్ PDAF టెక్నాలజీ, రియల్ టైమ్ AI ఫోటోగ్రఫి, 25 కేటగిరీలు, AI బ్యాక్లైట్ డిటెక్షన్ మరియు పోర్ట్రెయిట్ మోడ్లలో 209 సన్నివేశాలను గుర్తించే సామర్ధ్యంతో 12MP సోనీ IMX 363 సెన్సార్ను కలిగి ఉంది. ద్వితీయ కెమెరాగా 5MP సెన్సార్ను కలిగి ఉంది. ఫోన్లో రెండు స్పీకర్లు ఉన్నాయి: ఒకటి క్రింద ఉంది మరియు మరొకటి ఈయర్ పీస్ లో  ఉంది. ఇవి రెండు కూడా డిరాక్ HD సౌండ్తో డ్యూయల్ స్మార్ట్ పవర్ యాంప్లిఫైయర్ను కలిగివున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo