మిడ్ రెంజ్ ధరలో- 4GB ర్యామ్ మరియు మంచి ప్రొసెసరు కలిగిన బెస్ట్ 5 ఫోన్లు

HIGHLIGHTS

ఒక మిడ్ రేంజ్ ఫోన్ కొనాలనుకున్నపుడు మాత్రం జాగ్రత్తగా ఎంచుకోవాల్సివుంటుంది

మిడ్ రెంజ్ ధరలో- 4GB ర్యామ్ మరియు మంచి ప్రొసెసరు కలిగిన బెస్ట్ 5 ఫోన్లు

మనం ఒక ఫోనును కొనుగోలుచేయాలనుకుంటే, ముందుగా దానియొక్క ప్రాసెసర్ మరియు దానికి తగిన ర్యామ్ ఆ ఫోనులో ఉన్నాయా లేదా? అని పరిశీలిస్తాము. ప్రీమియం ఫోన్లలోఇటువంటి ఇబ్బంది ఉండదు కానీ, ఒక మిడ్ రేంజ్ ఫోన్ కొనాలనుకున్నపుడు మాత్రం జాగ్రత్తగా ఎంచుకోవాల్సివుంటుంది. మీ ఎంపికలను సులభతరం చేయడానికి మీకోసం, మిడ్ రేంజ్ లో ఉత్తమమైన 5 ఫోన్లను ఇక్కడ జాబితాగా అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

నోకియా 6.1 ప్లస్ 

ఈ నోకియా 6.1 స్మార్ట్ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసరుకి జతగా ఒక 4GB  వస్తుంది.  లైఫ్ -లైక్  చిత్రాల కోసం డ్యూయల్ వెనుక కెమెరా (16MP + 5MP) మరియు 16MP ముందు కెమెరాలు కలిగి ఉంటుంది. గేమ్స్, సినిమాలు లేదా వీడియోలు – ఆలస్యం లేకుండా వేగవంతంమైన అనుభవాన్నీ పొందండి, . నోకియా 6.1 ప్లస్ అద్భుతమైన బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంది.  

మోటో వన్ పవర్

షావోమి కంపెనీ నుండి వస్తున్నా పోటీకి మోటో నుండి సరైన సమాధానంగా వచ్చిన స్మార్ట్ ఫోనుగా ఈ మోటో వన్ పవర్ ను చెప్పొచ్చు. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. ఇది 4GB మరియు 64GB తో పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టే 15000 రూపాయల ధర విభాగంలో ఇది కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.               

రియల్మీ 2 ప్రో

రియల్మీ నుండి వచ్చిన ఈ  రియల్మీ 2 ప్రో,  స్మార్ట్ ఫోనులో కొత్తధనాన్నికోరుకుంటున్నయూత్ కోసం తీసుకొచ్చినట్లు రియల్మీ తెలిపినది. ఇందులో, డిమాండ్ లో ఉన్న అన్నిలక్షణాలను తెచ్చింది ఇందులో- కెమెరా లో పోర్ట్రైట్ మోడ్, డ్యూ డ్రాప్ డిస్ప్లే, మరియు ఈ ధరలో ఒక స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రాసెసరును 4GB ర్యామ్ కు జతగా తీసుకొచ్చింది మరియు అత్యధికంగా 8GB వరకు అందుబాట్లోవుంటుంది. అధిక మొత్తంలో, ఈ రియల్మీ 2 ప్రో అమ్మకాలను సాగించినట్లు కూడా కంపెనీ తెలిపింది.

హానర్ 8 X

హానర్ 8X  పెద్ద డిస్ప్లే మరియు వాటి అంచులు దాదాపు అన్ని వైపులా విస్తరిస్తాయి మరియు పైన నోచ్ ఉంటుంది, ఇందులోని నోచ్ ఇతర ఫోన్లలోలాగా పెద్దగా ఉండదు. హానర్ 8X కేవలం ఒక పెద్ద స్క్రీన్ కలిగిన ఫోన్ మాత్రమేకాదు, ఇది సరికొత్త కిరిన్ 710 SoC శక్తితో అధికమైన పనితీరును చేస్తుంది మరియు 4GB ర్యామ్ నుండి మొదలయ్యి 6GB వరకు అందుబాటులోవుంటుంది. అలాగే, దీనిలో AI బాగా పనిచేస్తుంది కెమేరా విభాగంలో కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది ఈ ఫోన్.

షావోమి మి A2

షావోమి మి A2 కూడా దాదాపుగా నోకియా 7 ప్లస్ వంటి  వివరాలను కలిగి ఉంది , కానీ ఇది తక్కువ ధరలో వస్తుంది. Mi A2  వెనుకభాగంలో ఒక అద్భుతమైన డ్యూయల్ కెమెరా కూడా కలిగిఉంది. అదనంగా,  Android One ధృవీకరణ కలిగివుంది అంటే ఇది ఆండ్రాయిడ్ 9 పై సహా, సాధారణ అప్డేట్లకు హామీ ఇస్తుంది .ప్రస్తుతం ఇది Android 9 Pie యొక్క అప్డేట్ కూడా పొందింది.  ఇది కూడా ఒక స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ మరియు 4GB RAM, 64GB స్టోరేజితో చాలా చక్కగా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo