కేవలం రూ.10,000 ధరలో గేమింగ్ & కెమేరా విభాగంలో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు

కేవలం రూ.10,000 ధరలో గేమింగ్ & కెమేరా విభాగంలో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు

ప్రస్తుతం, యువత ఎక్కువగా గేమింగ్ మరియు కెమేరా ప్రత్యేకతలను కలిగిన ఒక స్మార్ట్ ఫోన్ను ఎంచుకోవడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మరింత ఫన్ గా లైఫ్ ను ఉంచుకోవడానికి, స్మార్ట్ ఫోన్ను ఒక సాధనముగా ఉపయోగిస్తున్నారనేది వాస్తవం. TikTok వాటి ఆన్లైన్ వీడియో ప్లాట్ఫారం పైన యువత తమ వీడియోలను చిత్రీకరించండంలో స్మార్ట్ ఫోన్ అందులోనూ మంచి కెమేరా సామర్ధ్యాలను కలిగిన ఫోన్ చక్కగా ఉపయోగపడుతుంది.

అంతేకాదు, ప్రస్తుతం ఒక స్మార్ట్ ఫోన్ ఎంచుకునేవారికి గేమింగ్ కూడా ఒక ప్రధానాంశంగా మారింది. PUBG మరియు Aspalt 9 వంటి భారీ గేమ్స్ కి సపోర్ట్ చేయగల స్మార్ట్ ఫోన్లను ఎంచుకోవడానికి మక్కువ చూపుతున్నారు. అందుకోసమే, ప్రస్తుతం కేవలం రూ.10,000 ధరలో బెస్ట్ గేమింగ్ & కెమేరా స్మార్ట్ ఫోన్లలో టాప్ 5 లిస్ట్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.

1. REALME 5

రియల్మీ సంస్థ నుండి కేవలం రూ. 8,999 ధరలో క్వాడ్ కెమెరాల సెటప్పుతో కేవలం బడ్జెట్ ధరలో అత్యధికంగా అమ్ముడవవుతున్ననటువంటి ఈ రియల్మీ 5 స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది.  ఇది 2GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB/128GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక అతిపెద్ద 5,000 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది. అలాగే, 2019 డిజిట్ జీరో 1 అవార్డు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగం నుండి ఉత్తమ ఫోనుగా అవార్డును సొంతం చేసుకుంది.    

2. REDMI NOTE 8

షావోమి సంస్థ బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని, విడుదల చేసినటువంటి ఈ రెడ్మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ 2GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665ఆక్టా కోర్  ప్రాసెసర్ శక్తికి జతగా 4GB/6GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 64GB/128GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది ఈ ధరలో ఒక అతిపెద్ద కెమేరా సెటప్పు కలిగిన స్మార్ట్ ఫోనుగా చెప్పొచ్చు. ఇది వెనుక 48MP+8MP+2MP+2MP క్వాడ్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. అలాగే, 2019 డిజిట్ జీరో 1 అవార్డు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కెమేరా విభాగం నుండి ఉత్తమ ఫోనుగా అవార్డును సొంతం చేసుకుంది.    

3. Motorola One Macro

ఇటీవల భారతదేశంలో మంచి స్పెక్స్ తో, 10,000 రూపాయల కంటే తక్కువధరలో మోటోరోలా నుండి వచ్చినటువంటి స్మార్ట్  ఫోనుగా, ఈ మోటోరోలా వన్ మ్యాక్రో  గురించి చెప్పొచ్చు. ఇది ఒక 2.0GHz వద్ద క్లాక్ చెయ్యబడిన మీడియ టేక్ హీలియో P70  ఆక్టా కోర్ ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. అలాగే, ఇందులో 13MP +2MP+2MP AI ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 8MP గొప్ప సెల్ఫీ కెమెరా మరియు 4000mAh వంటి ప్రత్యేకతలతో వస్తుంది. అలాగే, 2019 డిజిట్ జీరో 1 అవార్డు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్ విభాగంలో మూడవ ఫోనుగా తన స్థానాన్ని పదిల పరచుకుంది.    

4. VIVO U10

వివో నుండి కేవలం బడ్జెట్ ధరలో కొత్తగా వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.35 అంగుళాల HD+ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, వెనుక 13MP+8MP+2MP  ట్రిపుల్ వెనుక కెమెరా మరియు ఒక 5000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది 2GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్  ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం రూ.8,499 రూపాయల ప్రారంభ ధరతో అమ్ముడవుతోంది.

5. Redmi Note 7 Pro

షావోమి నుండి ముందుగా బెస్ట్ కెమేరాతో వచ్చిన ఈ కెమేరా ఫోన్, 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 FHD+ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 48MP +5MP  డ్యూయల్  కెమేరా సేటప్పుతో మరియు ముందు 13MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది ప్రస్తుతం రూ.9,999 దరతో లభిస్తోంది. వాస్తవానికి, ఇది ముందుగా 13,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇందులోని ప్రధాన 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo