20 వేల ధరలో ఇండియాలోని టాప్ -5 స్మార్ట్ ఫోన్స్ (జూన్ 2022)

20 వేల ధరలో ఇండియాలోని టాప్ -5 స్మార్ట్ ఫోన్స్ (జూన్ 2022)
HIGHLIGHTS

20 వేల బడ్జెట్ ధరలో ఇండియాలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్

కేవలం 20 వేల కంటే తక్కువ బడ్జెట్ లో లభించే స్మార్ట్ ఫోన్లు

ఈ బడ్జెట్ లో మీకు తగిన ఫీచర్లు కలిగిన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు

ప్రస్తుతం 20 వేల బడ్జెట్ ధరలో ఇండియాలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీరు సరైన ప్లేస్ కే వచ్చారు.  ఎందుకంటే, ఈరోజు ఆన్లైన్ గేమింగ్, మల్టి టాస్కింగ్ మరియు మంచి క్వాలిటీ ఫోటోలను తీయగలిగిన స్మార్ట్ ఫోన్లలో టాప్ 5 గురించి చూడనున్నాము. అంతేకాదు, మనం చూడబోయే స్మార్ట్ ఫోన్లన్నీ కూడా కేవలం 20 వేల కంటే తక్కువ బడ్జెట్ లో లభించే స్మార్ట్ ఫోన్లు. అంటే, లేటస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఈ బడ్జెట్ లో మీకు తగిన ఫీచర్లు కలిగిన టాప్ 5 గురించి చుడనున్నాము.

Redmi Note 11T (Buy Here)

ధర : 15,999

రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక 50MP AI క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

Redmi Note 11 Pro+ (Buy Here)

ధర : రూ.20,999

రెడ్ మి నోట్ 11 ప్రో + ఫోన్ 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రోసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 128GB/256GB స్టోరేజ్ లను అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక 108MP ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 108MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరామరియు 2MP మ్యాక్రో  సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

vivo T1 5G (Buy Here)

ధర : రూ.15,990

Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకూ మెమోరిని మరింతగా విస్తరించవచ్చు. ఇక కెమెరాల విభాగంలో, 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.

Moto G51 (Buy Here)

ధర : రూ.13,499

Moto G51 పెద్ద 6.8 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌ డ్రాగన్ 480 ప్లస్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ మరియు జతగా 8GB RAMతో వస్తుంది. కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP+8MP+2MP ట్రిపుల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరాలను కలిగివుంటుంది. ఈ ఫోన్ 20W ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh  బ్యాటరీతో వస్తుంది.  ఈ ఫోన్ ఇండిగో బ్లూ మరియు బ్రెట్ సిల్వర్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది. నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ OS మరియు IP52 వాటర్ రెపెళ్ళంట్ డిజైన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది.

Realme 8 Pro (Buy Here)

ధర : రూ.19,990

Realme 8 Pro స్మార్ట్ ఫోన్ 6.44 అంగుళాల పరిమాణం గల SuperAMOLED డిస్ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది మరియు గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వస్తుంది. Realme ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఇందులో 108MP Samsung HM2 ప్రధాన కెమెరాని జతగా 8MP+2MP+2MP సెన్సార్ లను అందించింది. ఫోన్ ముందు పంచ్ హోల్ కటౌట్ లో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా బాక్స్ లోనే ఒక 65W ఫాస్ట్ ఛార్జర్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo