రేపు ఇండియాలో విడుదలకానున్న Honor 9X Pro స్మార్ట్ ఫోన్

రేపు ఇండియాలో విడుదలకానున్న Honor 9X Pro స్మార్ట్ ఫోన్

చైనా ప్రాధాన స్మార్ట్ ఫోన్ తయారీధారుడైన Huawei యొక్క ఉప బ్రాండ్ అయినటువంటి Honor, తన హానర్ 9 ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ను మే 12 అంటే రేపు ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మొబైల్ ఫోన్ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇండియాలో అమ్మకానికి తీసుకురానున్నట్లు చెబుతోంది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్ ధర రూ .15 వేల నుంచి రూ .20 వేల మధ్య ఉండబోతోందని కూడా తెలుస్తోంది. ఈ హానర్ ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ ఫిబ్రవరిలో ప్రారంభించబడింది.

 

 

హానర్ 9 ఎక్స్ ప్రో స్మార్ట్ ‌ఫోన్‌లో  కిరిన్ 810 చిప్‌సెట్‌ను పొందబోతున్నారు, ఇది కాకుండా, ఈ స్మార్ట్ ‌ఫోన్‌లో మీకు 8 జీబీ ర్యామ్‌తో 256 GB  స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ ఫోను‌లో ఒక 6.59-అంగుళాల FHD + నోచ్ లెస్ స్క్రీన్‌ వుంటుంది. దీనికి తోడు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో, ఒక 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అఫర్ చేస్తోంది.  ఈ బ్యాటరీతో మీకు 10W ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది, అంతేకాకుండా ఈ ఫోన్ను ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన EMUI 10 లో ప్రారంభించవచ్చు.

ఈ  హానర్ 9 ఎక్స్ ప్రో లో 16 MP సెల్ఫీ కెమెరా  ఉండనుంది , మీరు దానిని పాప్-అప్ మెకానిజంతో పొందుతారు, దీనికి తోడు ఇందులో  ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా పొందుతారు. ఈ ట్రిపుల్ కెమెరాలో ఒక ప్రధాన  48MP  లభిస్తుంది. ఇది కాకుండా, ఒక  8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు   2MP డెప్త్ సెన్సార్‌ కూడా  జతగా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo