బంపర్ ఆఫర్ తో రియల్మీ నార్జో 30 ప్రో 5G ఫస్ట్ సేల్ మరికొద్ది సేపట్లో….

HIGHLIGHTS

రియల్మీ నార్జో 30 ప్రో 5G మొదటి సేల్

రియల్మీ నార్జో 30 ప్రో 5G ఫోన్ పైన మంచి అఫర్

బంపర్ ఆఫర్ తో రియల్మీ నార్జో 30 ప్రో 5G ఫస్ట్ సేల్ మరికొద్ది సేపట్లో….

ఇండియాలో కేవలం మిడ్ రేంజ్ ధరలో డ్యూయల్ 5G తో రియల్మీ లేటెస్ట్ గా లాంచ్ చేసిన రియల్మీ నార్జో 30 ప్రో 5G మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 PMకి మొదలవుతుంది. లాంచ్ సమయంలో ఈ రియల్మీ నార్జో 30 ప్రో 5G ఫోన్ పైన మంచి అఫర్ ప్రకటించింది రియల్మీ. అదేమిటంటే,ఫోన్ ధరలో కేవలం 70% చెల్లించి ఫోన్ తీసుకోవచ్చు. దీని గురించి ఈ క్రిందా పూర్తిగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రియల్మీ నార్జో 30 ప్రో 5G : ధర

రియల్మీ నార్జో 30 ప్రో 6GB + 64GB వేరియంట్ ధర :Rs.16,999

రియల్మీ నార్జో 30 ప్రో 8GB + 128GB వేరియంట్ ధర :Rs.19,999

మార్చ్ 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ను Flipkart స్మార్ట్ అప్ గ్రేడ్ ప్లాన్ తో కనుక తీసుకున్నట్లయితే, కేవలం 70% పే చేసి ఫోన్ కొనుగోలు చెయ్యవచ్చు మరియు మిగిలిన 30% ఒక సంవత్సరం తరువాత చెల్లించవచ్చు. అయితే, ఈ ఆఫర్ కేవలం క్రెడిట్ కార్డు మరియు బజాజ్ ఫిన్ సర్వ్ కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది.           

రియల్మీ నార్జో 30 ప్రో 5G: స్పెషిఫికేషన్స్

ఇక రియల్మీ నార్జో 30 ప్రో పెద్ద 6.5 ఇంచ్ FHD+ రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ లేటెస్ట్ 5G ప్రాసెసర్, డైమెన్సిటీ 800U తో పనిచేస్తుంది. ఇది 2.4 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు మాలి -G57 GPU తో వుంటుంది. దీనికి జతగా, 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. ఆడియో పరంగా కూడా, Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ తో ఉంటుంది.

రియల్మీ నార్జో 30 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 48ఎంపీ ప్రధాన కెమెరా 110 డిగ్రీల 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్  కెమెరాకి జతగా 4CM మ్యాక్రో సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 16ఎంపీ సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. .

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ రియల్మీ నార్జో 30 ప్రో, పెద్ద 5,000 mAh బ్యాటరీని 30W డార్ట్ ఛార్జ్ సపోర్టుతో కలిగి వుంటుంది.                      

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile