POCO M3 Pro 5G: ఈరోజు ఇండియాలో లాంచ్ అవుతోంది

POCO M3 Pro 5G: ఈరోజు ఇండియాలో లాంచ్ అవుతోంది
HIGHLIGHTS

POCO M3 Pro 5G ఈరోజు ఇండియాలో లాంచ్ అవుతోంది

ఇతర దేశాల్లో చాలా తక్కువ ధరకే లాంచ్ అయ్యింది

POCO M3 Pro 5G లాంచ్ ఈవెంట్ 11:30 AM కి స్టార్ట్ అవుతుంది

పోకో ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన POCO M3 Pro 5G ఈరోజు ఇండియాలో లాంచ్ అవుతోంది. స్పెక్స్ లో ఎటువంటి మార్పులు లేకుండా గ్లోబల్ వేరియంట్ మాదిరిగానే ఇండియాలో ఈ ఫోన్ ను పోకో విడుదల చేస్తోంది. ఈ POCO M3 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇతర దేశాల్లో చాలా తక్కువ ధరకే విడుదల చేసింది. అయితే, ఇండియాలో ఏటివంటి ధరను నిర్ణయిస్తుందో చూడాలి. ఈ Poco 5G స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ 5G చిప్ సెట్ తో  పాటుగా మరిన్ని ప్రత్యేకతలతో ఇండియాలో లాంచ్ అవుతోంది.

POCO M3 Pro 5G: గ్లోబల్ వేరియంట్ ధరలు

ఈ ఫోన్ యొక్క ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్లో 4GB + 64GB బేసిక్ వేరియంట్ ని 159 యూరోలు(సుమారు 14,000 ధర) వద్ద ప్రకటించింది. ఇందులోనే, హై ఎండ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ ని 179 యూరోలు(సుమారు 16,000 ధర) వద్ద ప్రకటించింది. పోకో ఎం3 ప్రో 5G కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో అనే మూడు ఆకర్షిణీయమైన రంగుల్లో లభిస్తుంది.

POCO M3 Pro 5G: స్పెషిఫికేషషన్స్

POCO M3 Pro 5G యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD + రిజల్యూషన్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది. అధనముగా, ఈ డిస్ప్లే డైనమిక్ స్విచ్ ఫీచర్ మరియు 1,500: 1 కాంట్రాస్ట్ రేషియోకు మద్దతు ఇస్తుంది.

ఇక ఫోన్ ప్రాసెసర్ పరంగా, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో వస్తుంది, ఇది 6GB RAM వరకు మరియు 128GB వరకు స్టోరేజ్ తో జతగా వస్తుంది. ఇందులోని కెమెరా సెటప్, వెనుక భాగంలో ట్రిపుల్-లెన్స్ సెటప్ ఉంది, ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చర్‌ తో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అలాగే, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌ తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌ తో మరో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ కెమెరా నైట్ మోడ్, AI కెమెరా 5.0, మూవీ ఫ్రేమ్, టైమ్ లాప్స్, స్లో మోషన్ వీడియో మరియుమ్యాక్రో మోడ్‌తో సహా అనేక ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

సెల్ఫీల కోసం, మూవీ ఫ్రేమ్ వంటి ఫీచర్లకు మద్దతునిచ్చే f / 2.0 ఎపర్చర్‌ తో 8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది. ఇది కాకుండా, పోకో ఎం 3 ప్రో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్‌ లాక్‌ తో వస్తుంది. ఈ పోకో ఎం 3 ప్రో 5 జి స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందించబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo