ఈ రోజు విడుదల కానున్న హానర్ వ్యూ 20 : లైవ్ ఈవెంట్

HIGHLIGHTS

ఒక పంచ్ హోల్ డిస్ప్లేతో ఇండియాలో విడుదలకానున్న మొట్టమొదటి ఫోన్ ఈ హానర్ వ్యూ 20.

హానర్ వ్యూ 20, జనవరి 22 న ప్యారిస్ లో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించబడింది. ఈ రోజు , ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదలకానున్నది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్, దాదాపుగా బెజెల్స్ లేని విధంగా అతి సన్నని బెజెల్స్ తో ఒక పంచ్ హోల్ డిస్ప్లేతో ఇండియాలో విడదల అవనున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది. అంతేకాదు, 48MP కెమేరాతో ఇండియాలో విడుదల అవనున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. 

హానర్ వ్యూ 20 లైవ్ స్ట్రీమ్ చూడడం ఎలా ?
అనేక సోషల్ మీడియా మరియు యుట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ లైవ్ అందుబాటులో ఉండగా, హానర్ కంపెనీ యొక్క యూట్యూబ్, పేస్ బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్ల ద్వారా నేరుగా లైవ్ చూడవచ్చు.       

హానర్ వ్యూ 20 ప్రత్యేకతలు

ఈ హానర్ వ్యూ 20,  2310×1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో  ఒక పెద్ద 6.4 అంగుళాల Full HD + ఆల్-వ్యూ డిస్ప్లేని కలిగి ఉంది. ఆల్-వ్యూ డిస్ప్లే అనేది ఒక ప్యానెల్ రంధ్రంతో కూడిన డిస్ప్లేతో ఉంటుంది డిస్ప్లేలో కేవలం ఒక పానల్ రంధ్రం మాత్రమే ఉంటుంది, ఇది ఒక సెలి షూటర్ను కలిగివుంటుంది. ఎగువ ఎడమ మూలలో గుండ్రంగా 4.5mm వ్యాసంలో ఇది ఉంటుందని అని హువావే చెప్పింది.   గ్లాస్ క్రింద,  V- ఆకార నమూనాతో ఒక గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్  బ్లూ, బ్లాక్ మరియు రెడ్ కలర్లలో అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఆక్టా – కోర్ కిరిన్ 980 ప్రధాన చిప్సెట్ తో శక్తినిస్తుంది, ఇది 7nm ప్రాసెసుతో తయారు చేయబడుతుంది. అదే ప్రాసెసర్ Huawei యొక్క తాజా ఫ్లాగ్షిప్ అయినటువంటి, హువావే మేట్ 20 ప్రో లో చేర్చారు. ఈ పరికరం GPU టర్బో 2.0 తో వస్తుంది, ఇది గేమింగ్ సెషన్ల సమయంలో పనితీరు మరియు గ్రాఫిక్స్లను  మెరుగుపరిచే సాంకేతికత అని సంస్థ చెబుతోంది. CPU ఉష్ణోగ్రత పరిశీలనలో ఉంచడానికి ఒక లిక్విడ్ కూల్ టెక్నాలజీ వ్యవస్థ కూడా ఉంది.

కెమెరా విభాగంలో, హానర్ వ్యూ 20 వెనుక 48MP సోనీ IMX586 CMOS సెన్సార్ను కలిగి ఉంది. 1.6 మైక్రో పిక్సెల్ను అందించడానికి సెన్సార్ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. డ్యూయల్ వెనుక కెమెరా యొక్క రెండవ సెన్సార్ డెప్త్ లను పట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. డిస్ప్లేలోవున్న పంచ్ రంధ్రం f / 2.0 ఎపర్చరుతో 25MP సెన్సార్ను కలిగి ఉంటుంది. ఒక 4,000 mAh బ్యాటరీ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో ఉంది. ఈ ఫోన్ Android 9.0 Pie  పైన ఆధారితమైన మేజిక్ UI 2.0 తో నడుస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :