ఈ రోజు విడుదలకానున్న గూగుల్ పిక్సెల్ 3A మరియు 3A XL

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 May 2019
HIGHLIGHTS
  • Google మరియు Flipkart, ఈ లాంచ్ యొక్క టీజింగులను గురించి చెబుతున్నాయి మరియు Google పిక్సెల్ 3A మరియు 3A XL స్మార్ట్ ఫోన్లు ఈ ఆరోజే ప్రకటించనుంది.

ఈ రోజు విడుదలకానున్న గూగుల్ పిక్సెల్ 3A మరియు 3A XL

మే 7 న, I / O 2019 ఈవెంట్లో గూగుల్ రెండు కొత్త పిక్సెల్ హ్యాండ్సెట్లను ప్రకటించనుంది.  Google మరియు Flipkart, ఈ లాంచ్ యొక్క టీజింగులను గురించి చెబుతున్నాయి మరియు  Google పిక్సెల్ 3A మరియు 3A XL స్మార్ట్ ఫోన్లు ఈ ఆరోజే ప్రకటించనుంది. రెండు ఫోన్ల గురించి అనేక లీకులు మరియు నివేదికలు ఇప్పటికే ఆన్లైన్ కోకోల్లలుగా వచ్చాయి,  ఇప్పటికే ఉన్న పిక్సెల్ 3 మరియు 3 XL హ్యాండ్ సెట్ల యొక్క సరసమైన వెర్షన్లుగా ఈ ఫోనులు ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే,  పిక్సెల్ 3 లో చూసిన అదే గొప్ప కెమెరా నాణ్యతను తగ్గకుండా రానున్నట్లు కూడా అనేక రూమర్లు వచ్చాయి.

ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం  చూడడం ఎలా?

కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూలో షోర్లైన్ అంఫిథియేటర్లో గూగుల్ తన I / O 2019 ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 10AM PDT (లేదా 10:30 PM IST) వద్ద ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ YouTube లో ప్రత్యక్షంగా ప్రసారం చేయబడుతుంది. 

Google Pixel 3a మరియు 3a XL యొక్క లీకైన  స్పెక్స్

పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL స్మార్ట్ఫోన్లు ఇటీవల ఒక బ్లూటూత్ సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించాయి, ఈ వెబ్సైట్ వాటి పేర్లను నిర్ధారించింది. ఇది ఒక నోచ్  లేకుండా 18: 9 యాస్పెక్ట్ రేషియోతో డిస్ప్లేను అందిస్తుంది. అధనంగా, ఈ హ్యాండ్సెట్లు సింగిల్ రియర్ కెమెరా సెటప్ మరియు ఒక వేలిముద్ర సెన్సారుతో పాటు, వెనుక ప్యానల్లో డ్యూయల్ టోన్ డిజైన్ ఉంటాయని భావిస్తున్నారు.

గూగుల్ పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL వరుసగా 5.6 అంగుళాల మరియు 6.3-అంగుళాల OLED డిస్ప్లేని కలిగి ఉన్నాయి. పరిమాణంలో చిన్నదైన  పిక్సెల్ 3A స్నాప్డ్రాగెన్ 670 SoC ఆధారితమైనది మరియు మరింత శక్తివంతమైన పిక్సెల్ 3A XL స్నాప్డ్రాగెన్ 710 SoC మద్దత్తుతో వస్తాయి. అయితే, ఇవి  4GB RAM తో వస్తాయి . రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 9 పై OS తో నడుస్తాయని భావిస్తున్నారు మరియు  అందుబాటులో ఉన్నప్పుడు Android Q అప్డేట్  పొందడానికి మొదటి వరుసలో ఈ ఫోన్లు వుంటాయని చెప్పవచ్చు. పిక్సెల్ 3a XL యొక్క రిటైల్ బాక్స్, ఇటీవల కూడా బెస్ట్ బైలో కనిపించింది

పిక్సెల్ 3a 3,000 mAh బ్యాటరీని ప్యాక్ చేయగా, పిక్సెల్ 3a XL బ్యాటరీ సామర్థ్యంపై సమాచారం లేదు. ఈ ఫోన్ గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్ఫోన్లలో  గూగుల్ తేసేసినటువంటి  హెడ్ఫోన్ జాక్ ను కూడా తిరిగి తీసుకొచ్చింది. ఫోటో ప్రాసెసింగ్ కోసం Google యొక్క పిక్సెల్ విజువల్ కోర్ చిప్ ను, ఈ  ఫోనులో ప్రదర్శిస్తుందని చాల రూమర్లు సూచిస్తున్నాయి.

logo
Raja Pullagura

email

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 15999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status