ఇవే Android 9.0 కి అప్డేట్ కానున్న Nokia స్మార్ట్ ఫోన్లు

HIGHLIGHTS

Android 9.0 కి అప్డేట్ కానున్న Nokia ఫోన్ల యొక్క కాలక్రమాన్నిప్రచురించిన HMD గ్లోబల్

ఇవే Android 9.0 కి అప్డేట్ కానున్న Nokia స్మార్ట్ ఫోన్లు

HMD గ్లోబల్, నోకియా ఫోన్ల కోసం సాధారణ అప్డేటును విడుదల చేసింది, ఇటీవల, ఇది నోకియా 5.1 ప్లస్ మరియు నోకియా 6.1 ప్లస్ లకు Android Pie 9.0 అప్డేటును విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా,  ఈ ఫిన్నిష్ కంపెనీ వివిధ మోడళ్లకు ఆండ్రాయిడ్ పై అప్డేటును వ్యక్తం చేసే, సంస్థ యొక్క మార్గదర్శినిని చూపించే ఈ జాబితాను ఇప్పుడు ప్రచురించింది. ఇందులో, నోకియా 1, నోకియా 2.1, నోకియా 3.1, నోకియా 5.1, నోకియా 5, నోకియా 6 మరియు నోకియా 3.1 ప్లస్ ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా, నోకియా 2 ని మాత్రం ఈ జాబితాలో చేర్చలేదు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ జాబితాను, HMD గ్లోబల్ చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ అయినటువంటి, జుహు సర్వికాస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ జాబితా ప్రకారం, ఈ నెల చివరినాటికి నోకియా 5 మరియు 3.1 ప్లస్ Android పై ని అందుకుంటాయి.  డాల్బీ అమలు పూర్తయిన వెంటనే మొదటి త్రైమాసికం చివరి నాటికల్లా,  నోకియా 6 ఈ అప్డేటును  పొందుతుంది. నోకియా 6 తో పాటు, నోకియా 2.1, నోకియా 3.1 మరియు నోకియా 5.1 మొదటి త్రైమాసికం ముగిసే ముందుగానే Android Pie  కి అప్డేట్ చెయ్యబడతాయి.

అయితే, నోకియా 3 మరియు నోకియా 1 రెండు కూడా 2019 రెండవ త్రైమాసికంలో అప్డేట్ చేయబడతాయి. నోకియా 2 ని కట్ చూపించనందున, కంపెనీ మొత్తంగా దాని కోసం అప్డేటును దాటవేస్తుందని తెలుస్తోంది. ఈ రోడ్ మ్యాప్, HMD ప్రస్తుతం నోకియా 8 మరియు నోకియా 8 సిరోకోలకు Android 9 పై అప్డేట్  విడుదల చేయడం పైన పని చేస్తుందని చూపిస్తుంది. Android Oreo మరియు Oreo 8.1 పోర్ట్ ఫోలియోలను పూర్తి చేయడంలో HMD అత్యంత వేగవంతమైనదని సర్వికాస్  పేర్కొన్నారు మరియు ఈసారి వేగవంతంగా ఉండదానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ Android 9 అప్డేట్, కొత్త సిస్టమ్ నావిగేషన్ స్కీమ్, అడప్టివ్ బ్రైట్నెస్ మరియు అడప్టివ్ బ్యాటరీ వంటి సాధారణ Android Pie ఫీచర్లతో కూడైన ఒక ప్రామాణిక సెట్నుఅందిస్తుంది. అలాగే ఇది డాష్బోర్డ్ వంటి డిజిటల్ శ్రేయస్సు ఫీచర్లను కూడా తెస్తుంది, డివైజ్ ఎన్నిసార్లు అన్లాక్ చేయబడింది మరియు నోటిఫికేషన్లను అందుకున్న సంఖ్యతో సహా, ఇది స్క్రీన్ సమయాన్ని మరియు ఫోన్ వాడకాన్ని హైలైట్ చేస్తుంది. ఫోన్ కూడా ఆప్ టైమర్లు (ఆప్ వాడకంపై సమయ పరిమితులను అమర్చడం) మరియు విండ్ డౌన్ మోడ్, అలాగే డునాట్ డిస్టర్బ్ ఫీచర్స్ (మీ ఫోన్ను బెడ్ కోసం సిద్ధంగా ఉండటానికి రోజువారీ షెడ్యూల్ను సెట్ చేయడానికి) కూడా పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo